మోటొరోలా తన స్మార్ట్‌ఫోన్‌లలో భారతీయ టెలికాం ఆపరేటర్ల కోసం 5G సపోర్ట్‌ను ఎనేబుల్ చేసే సాఫ్ట్‌వేర్ రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. లెనోవా యాజమాన్యంలోని మోటొరోలా భారతదేశం 5జీ సపోర్ట్‌ను తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్లాన్లు రెడీ చేసింది. సాఫ్ట్‌వేర్ రోల్‌అవుట్ యొక్క మొత్తం షెడ్యూల్‌ను ప్రకటించింది. 11 స్మార్ట్‌ఫోన్‌లకు ఈ అప్‌డేట్ రానుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే Airtel, Jio, Vi 5G సేవలను అనుమతించే OTA అప్‌డేట్‌ను అందుకోవడం ప్రారంభించాయి.


“భారతదేశంలోని మోటొరోలా 5జీ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో ప్రకటించబడిన మొత్తం 8 సబ్ 6GHz 5జీ బ్యాండ్‌లతో సహా 11 నుంచి 13 5జీ బ్యాండ్‌లకు హార్డ్‌వేర్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. SA (రిలయన్స్ జియో), NSA (ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా) 5జీ మోడ్‌లలో ఒకేసారి 5.ీని ఎనేబుల్ చేయడం కోసం ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను మేం ఇప్పటికే ప్రారంభించాము. వినియోగదారులు ఆపరేటర్‌లలో ఎటువంటి  అంతరాయాలు లేని 5జీని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.”అని మోటొరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి చెప్పారు.


ఇటీవలే లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఇప్పుడు ఎయిర్‌టెల్ 5జీ ప్లస్, జియో ట్రూ 5జీలను సపోర్ట్ చేస్తాయి. మిగిలిన మోటొరోలా ఫోన్‌లు నవంబర్ మొదటి వారంలో సాఫ్ట్‌వేర్‌ను అందుకోవచ్చని భావిస్తున్నారు.


భారతదేశంలో 5జీ సేవలతో ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి వీలు కల్పించే సాఫ్ట్‌వేర్ రోల్ అవుట్‌లో ఆలస్యంపై అవుతుందని మోటొరోలా ఆందోళన చెందుతోంది. Realme, Oppo, Vivo, OnePlus, iQOO వంటి చైనీస్ బ్రాండ్‌లు ఇప్పటికే తమ చాలా ఫోన్‌లకు అవసరమైన OTA అప్‌డేట్‌ను విడుదల చేశాయి. Apple, Samsung, Google, HMD గ్లోబల్ (నోకియా మొబైల్), Asus ఇప్పటికీ సపోర్ట్‌ను పరీక్షిస్తున్నాయి.


యాపిల్ తన 5G ఐఫోన్‌లకు డిసెంబరులో ఓటీ అప్‌డేట్ వస్తుందని తెలిపింది. అయితే శాంసంగ్ నవంబర్‌లో తన కొన్ని ఫోన్‌ల కోసం రోల్‌అవుట్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు వీలైనంత త్వరగా Pixel 6a, Pixel 7 ఫోన్‌లకు 5జీ సపోర్ట్‌ను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?