మోటొరోలా రేజర్ 40, మోటొరోలా రేజర్ 40 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు జులై 3వ తేదీన లాంచ్ కానున్నాయి. వీటి లాంచ్‌కు వారం రోజుల ముందు అనుకోకుండా మోటొరోలా రేజర్ 40 ధరను అమెజాన్ రివీల్ చేసింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లో 6.9 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 33W టర్బో ఛార్జింగ్‌ను మోటొరోలా రేజర్ 40 సపోర్ట్ చేయనుంది.


మోటొరోలా రేజర్ 40 ధరను కంపెనీ అమెజాన్ యాక్సిడెంటల్‌గా టీజ్ చేసింది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఈ క్లామ్‌షెల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.59,999 నుంచి ప్రారంభం కానుంది. అయితే మోటొరోలా రేజర్ 40 అల్ట్రా ధర గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు.


మోటొరోలా రేజర్ 40 ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. చైనాలో ఈ ఫోన్‌కు సంబంధించి 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (సుమారు రూ.46,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 యువాన్లుగా (సుమారు రూ.49,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,699 యువాన్లుగా (సుమారు రూ.54,500) ఉంది.


మోటొరోలా రేజర్ 40, మోటొరోలా రేజర్ 40 అల్ట్రా రెండు ఫోన్లూ మనదేశంలో జులై 3వ తేదీన లాంచ్ కానున్నాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత చవకైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మోటొరోలా రేజర్ 40 కానుంది. ఆఫర్ కూడా కలుపుకుంటే రూ.54 వేల లోపే దీన్ని కొనుగోలు చేవయచ్చు.


మోటొరోలా రేజర్ 40 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
మోటొరోలా రేజర్ 40 స్మార్ట్ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫోల్డబుల్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ మోటొరోటా రేజర్ 40లో ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


మోటొరోలా ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది. మోటొరోలా ఎడ్జ్ 40 ప్రస్తుతానికి యూరోప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను మోటొరోలా ఎడ్జ్ 40లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధరను 599.99 యూరోలుగా (సుమారు రూ.54,000) నిర్ణయించారు. ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ బ్లాక్, నెబ్యులా గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.



Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!