మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌పై మోటో జీ54 5జీ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.
మోటో జీ54 5జీ ధర, ఆఫర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించారు. మిడ్‌నైట్ బ్లూ, మింట్ గ్రీన్, పీర్ బ్లూ కలర్ ఆప్షన్లలో మోటో జీ54 5జీ కొనుగోలు చేయవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు తగ్గింపు లభించనుంది. అంటే రూ.14,499కే మోటో జీ54 5జీని కొనుగోలు చేయచ్చన్న మాట. ఈఎంఐ ఆప్షన్లు రూ.668 నుంచి ప్రారంభం కానున్నాయి.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
మోటో జీ54 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత మై యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ54 5జీ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14కు అప్‌డేట్‌ను అందించనున్నట్లు మోటొరోలా తెలిపింది. అలాగే మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లేకు సంబంధించి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌పై మోటో జీ54 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. అాలాగే 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐపీ52 వాటర్ రెసిస్టెంట్ బిల్డ్ కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను మోటో జీ54 5జీ సపోర్ట్ చేయనుంది. 66 నిమిషాల్లో ఈ ఫోన్ 0 నుంచి 90 శాతం ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial