BGMI 3.4 Update is Now Available : ఆన్‌లైన్ గేమర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్ ఇండియా- BGMI 3.4 అప్‌డేట్ వచ్చేసింది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి అప్‌డేట్‌ అందుబాటులో ఉంది. క్రిమ్సన్‌ మూన్ అవేకెనింగ్ టైటిల్‌తో భయపెట్టే థీమ్‌తో ఈ అప్డేట్ అదరగొడుతోంది. ఈ అపడేట్ ఎలా చేయొచ్చు.. ఎక్కడ అందుబాటులో ఉంది ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం..!


ఫ్రెష్‌ లుక్‌, అమేజింగ్‌ కంటెంట్‌తో కొత్త అప్‌డేట్‌:


బాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్ ఇండియా- BGMI 3.4 అప్‌డేట్ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ బ్‌రాండ్ న్యూ అప్‌డేట్ ద్వారా ఈ గేమ్‌కు ఫ్రెష్‌నెస్‌తో పాటు అమేజింగ్ కంటెంట్‌ కూడా యాడ్‌ అయింది. న్యూ హార్స్‌తో పాటు ట్రాన్స్‌ఫర్‌మేషన్ స్కిల్స్, థీమ్‌డ్‌ ఏరియాస్‌తో పాటు ఇంకా ఎన్నో గేమ్ ప్లే మెకానిక్స్‌ను కూడా ఈ వర్షన్‌లో ఉంచారు.


శుక్రవారం ఉదయం 6న్నరకే ఈ అప్‌డేట్ అందుబాటులోకి రాగా.. ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అప్డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ యూజర్స్ మాత్రం ఉదయం 8న్నర గంటల తర్వాత అప్‌డేట్‌ను అందుబాటులో ఉంచారు. వీళ్లు IOS యూజర్స్ యాపిల్ స్టోర్ నుంచి అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్‌డేట్‌ను గ్రాడ్యువల్‌గా రోల్ చేస్తున్నట్లు గేమింగ్ సంస్థ తెలిపింది. ఈ అప్‌డేట్‌ కోసం కాస్త పేషెన్స్ కూడా అవసరమని సూచించింది. ఉదయం 11న్నర గంటల వరకూ అప్‌డేట్ మెసేజ్ కోసం ఎదురు చూడాలని అప్పటికీ రాకుంటే.. గేమింగ్‌ సంస్థను డిస్కార్డ్ సర్వర్‌ ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్లు మీ సమస్యను పరిష్కరిస్తారని గేమింగ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వేరే ఇల్లీగల్ మార్గాల ద్వారా మాత్రం గేమ్‌ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలకు తాము బాధ్యత వహించబోమని హెచ్చరించింది. అప్‌డేట్ ప్రక్రియ మొత్తం అనుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.


BGMI 3.4 అప్‌డేట్ గైడ్‌.. ఈ టిప్స్ పాటించాలి:


 స్టెప్‌ 1 : ముందుగా మన మొబైల్ కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి. ఈ అప్‌డేట్‌ కోసం చాలా స్పేస్ అవసరం అవుతుందని గేమింగ్ సంస్థ పేర్కొంది.


స్టెప్‌ 2: అప్‌డేట్‌ ది యాప్‌


 ఐఓఎస్ యూజర్స్ ఐతే.. యాప్‌ స్టోర్‌కు వెళ్లి.. టాప్‌ రైట్ కార్నర్‌లోని మన ప్రొఫైల్‌ ఐకాన్‌పై టచ్‌ చేసి అవైలబుల్ అప్డేట్స్ ఆప్షన్ ఎంచుకొని అందులో బీజీఎమ్‌ఐ గేమింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.


ఆండ్రాయిడ్ యూజర్స్ ఐతే.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వేళ్లి.. టాప్‌ లెఫ్ట్‌ కార్నర్‌లో ఉన్న మెనూ ఐకాన్‌పై టచ్‌ చేస్తే అక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి బీజీఎమ్‌ఐ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే ఇక గేమ్ కొత్త వర్షన్‌లోకి వెళ్తుంది.


స్టెప్‌ ౩:  ఒక వేళ ట్రస్ట్‌డ్‌ సోర్సెస్‌ నుంచి ఏపీకే ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అందుకు అనుగుణంగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఛేంజ్ చేసుకోవాలి.


స్టెప్‌ 4: అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత డివైస్‌ ను రీస్టార్ట్ చేయాలి. ఆ తర్వాత BGMI గేమింగ్ యాప్ ఓపెన్ చేసి కొత్త కంటెంట్‌, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చని గేమింగ్ సంస్థ తెలిపింది.  


Also Read: ఈ 5జీ స్మార్ట్​ ఫోన్లలో ఏది బెస్ట్​​, ధర ఎంత? ఫీచర్ల పూర్తి వివరాలివే