ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో తమ యూజర్స్‌ను అలరించేందుకు సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్ల్లోకి విడుదల చేస్తోంది. అలా గత నెలలో T సిరీస్‌లో విడుదల చేసిన టీ3 ప్రోకు మంచి ఆదరణ రావడంతో రీసెంట్గా టీ3 అల్ట్రా 5జీని దేశీయ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఏఐ ఫీచర్లను జోడించి మార్కెట్లోకి వదిలింది.
అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో ఏది కొనుగోలు చేయాలి? ఏది బెటర్ అనే దానిపై యూజర్స్‌లో చాలా మందికి చిన్న గందరగోళం ఏర్పడే వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఏది బెటర్, దేనీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? వంటి పూర్తి సమాచారం ఈ కథనంలో మీకు అందిస్తున్నాం. ఇందులో డిస్‌ప్లే, కెమెరా సెటప్, ప్రాసెసర్, బ్యాటరీ, ధరతో పాటు పూర్తి వివరాలను ఉన్నాయి.
వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.28,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ పేమెంట్‌తో అయితే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. రూ. 3 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. లునార్ గ్రా, ఫ్రాస్గ్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. వివో టీ3 ప్రో 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే రూ. 24,999కు దొరుకుతుంది. ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ రంగులలో ఇది అందుబాటులో ఉంది.
వివో టీ3 అల్ట్రా 5జీ 6.78 ఇంచ్ త్రీడి కర్వ్‌డ్ అమోలెడ్ 1.5K డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్. వివో టీ3 ప్రో 6.67 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 4500 బ్రైట్నెస్ను ఇస్తుంది.
వివో టీ3 అల్ట్రా 5జీ 8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ, 12జీబీ+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ర్యామ్‌ను 24జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. వివో T3 ప్రో ఫోన్ 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది.
వివో టీ3 అల్ట్రా 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో టీ3 ప్రో 5,500mAh కెపాసిటీతో పని చేస్తుంది. ఇది కూడా 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వివో టీ3 అల్ట్రా 5జీ, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉపయోగించారు. వివో టీ3 ప్రో స్మాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కూడా ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్‌తో నడుస్తుంది.
వివో టీ3 అల్ట్రా 5Gలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ యూఎస్‌బీ 2.0 పోర్ట్, బ్లూటూత్ 5.3, వైఫై5కు సపోర్ట్ చేస్తుంది. వివో టీ3 ప్రో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 2000 Hz క్విక్ టచ్ ప్యాటర్న్ రెడ్, 4డీ గేమ్ వైబ్రేషన్ వంటి వాటిని సపోర్ట్ చేస్తుంది.
వివో టీ3 అల్ట్రాలో డ్యూయెల్ రియర్ కెమెరా ఉంది. వెనకవైపు 50ఎంపీ సోనీ IMX921 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు సెల్ఫీ కోసం 50ఎంపీ కెమెరా ఉంటుంది. ఏఐ ఎరేజర్, ఫొటోల క్వాలిటీ పెంచేందుకు, ఎడిట్ చేసేలా ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. వివో టీ3 ప్రోలో కూడా డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటివి ఉన్నాయి.