Lava O2 Launch: లావా ఓ2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీన్ని కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతోపాటు ఈ ఫోన్ డిజైన్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ మనదేశంలో రాబోయే కొన్ని వారాల్లో మనదేశంలో లాంచ్ కానుంది. అమెజాన్‌లో దీనికి సంబంధించిన లిస్టింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఇందులో రివీల్ అయ్యాయి.


గ్రీన్ కలర్‌వే ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. కెమెరా మాడ్యూల్‌లో కాస్త మార్పులు కూడా చేశారు. వేర్వేరు యాంగిల్స్‌లో ఇది ఒక్కోలా కనిపిస్తుంది. కింద భాగంలో ఎడమవైపు చిన్న లావా లోగో చూడవచ్చు. దీని డిజైన్‌ మ్యాట్ ఫినిష్‌తో వచ్చింది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్ కూడా చూడవచ్చు.


అమెజాన్‌లో పేర్కొన్న లావా ఓ2 స్పెసిఫికేషన్లను బట్టి ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, ముందువైపు హోల్ పంచ్ కటౌట్లో సెల్ఫీ కెమెరా అందించానున్నారు. మొబైల్ వెనకభాగాన్ని ఏజీ గ్లాస్‌తో రూపొందించారు. మ్యాజెస్టిక్ పర్పుల్ కలర్‌వేలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై లావా ఓ2 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 అందించనున్నారు. అంటుటు బెంచ్ మార్క్ టెస్టులో ఈ ఫోన్ 2.5 లక్షల పాయింట్లను సంపాదించింది.


ఈ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారో తెలియరాలేదు. లావా ఓ2 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


Also Read: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!


Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?