Realme Neo GT Neo 6 SE Launch Date: రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. రియల్‌‌మీ జీటీ నియో 6తో పాటు ఈ ఫోన్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. రియల్‌మీ జీటీ నియో 6లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై వర్క్ కానుందని తెలుస్తోంది.


రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుందని సమాచారం. చైనాలో త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఏస్ 3వీలో కూడా ఇదే ప్రాసెసర్ ఉండనుందట. రియల్‌మీ దీనికి సంబంధించిన వివరాలను త్వరలో షేర్ చేయనుంది. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్‌లో ఇందులో అందించనున్న 7 ప్లస్ జెన్ 3నే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్. బెంచ్ మార్క్ వెబ్ సైట్లలో కూడా ఇది తన సత్తా నిరూపించుకుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3లో అందించిన ఆర్కిటెక్చర్‌నే ఇందులో కూడా అందించారు.


గతంలో వచ్చిన కథనాల ప్రకారం... రియల్‌మీ జీటీ 5 ఎస్ఈకి తర్వాతి వెర్షన్‌గా రానున్న ఈ ఫోన్‌లో 1.5కే ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 00W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


గత సంవత్సరం రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన లెన్స్‌గా ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 6.74 అంగుళాల 1.5కే డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 100W ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేసేది.


మరోవైపు రియల్‌మీ త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. అదే రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ. ఈ ఫోన్ లాంచ్‌ను రియల్‌మీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో సేల్‌కు రానుంది. ఈ ఫోన్ మార్చిలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రో సైట్‌ ఇప్పటికే అమెజాన్‌లో లైవ్ అయింది. దీని కారణంగా ఫోన్ గురించి అనేక ఫీచర్లు బయటకు వచ్చాయి. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను రియల్‌మీ అందిస్తుంది. ఈ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్‌ చేయడం విశేషం. 1/1.56 అంగుళాల సెన్సార్ పరిమాణంతో వచ్చే సెన్సార్‌ను ఫోన్ ప్రధాన కెమెరాగా అందించారు. ఈ ఫోన్ ప్రధాన కెమెరా మునుపటి వెర్షన్ కంటే 64 శాతం ఎక్కువ కాంతిని క్యాప్చర్ చేస్తుందని రియల్‌మీ పేర్కొంది.


Also Read: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!


Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?