లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్లు మనదేశంలో జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకుంటే ప్రత్యేక ఆఫర్ లభిస్తుందని కూడా తెలిపారు. దీని ఫొటోలను కంపెనీ షేర్ చేసింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం.


స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మనదేశంలో గురువారం ప్రారంభం కానున్నాయి. తాజా కథనం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.10 వేలలోపే ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 7వ తేదీన లాంచ్ కానుందని కంపెనీ గతంలోనే ప్రకటించింది. దీనికి “Time to shine. Time for Blaze.” అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.


ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్‌ను కూడా లావా షేర్ చేసింది. ఈ ఫోన్ డిఫరెంట్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. గ్రీన్, బ్లాక్, రెడ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను చూడవచ్చు. 13 మెగాపిక్సెల్ ఏఐ లెన్స్ ఇందులో ఉండనుంది.


కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. యూనిసోక్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!