Jio Phone 5G:రిలయన్స్ జియో మోస్ట్ అవైటెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ 5జీకి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. జియో ఫోన్ 5జీ ఇమేజ్ ఆన్‌లైన్‌లో లీక్ అయింతది. ఈ ఏడాది దీపావళికి ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని కూడా వార్తలు. లీకైన ఫోటోలో ఫోన్ వెనుక ప్యానెల్, ముందువైపు చూడవచ్చు. ఇంతకు ముందు కూడా ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం చాలాసార్లు లీక్ అయింది. కానీ ఈసారి దాని ప్రధాన ఫీచర్ల గురించి లీకులు వచ్చాయి. ఇది ఒక బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ అని తెలుస్తోంది.


ప్రాసెసర్, కెమెరా ఇలా
ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఈ ఫోన్ ఫొటోను షేర్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి లేదా న్యూ ఇయర్ మధ్య ఎప్పుడైనా ఈ ఫోన్ మార్కెట్లోకి రావచ్చని అందులో పేర్కొన్నారు. జియో ఫోన్ 5జీ యూనిసోక్ 5జీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చని ఈ యూజర్ తెలిపారు. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా చూడవచ్చు. ఇందులో ప్రధాన కెమెరా కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవచ్చు.






లీకైన ఫొటోను బట్టి చూస్తే జియో ఫోన్ 5జీ ప్లాస్టిక్ బాడీ ప్యానెల్‌తో లాంచ్ కానుందని అనుకోవచ్చు. ముందు వైపు వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్న డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. వార్తల ప్రకారం ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు సమాచారం. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని వార్తల్లో వినిపిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనుంది. వినియోగదారులు జియో యాప్స్ అన్నీ డిఫాల్ట్‌గా పొందుతారు.


ధర ఎంత ఉండవచ్చు?
లీకైన ఫొటోలను పోస్ట్ చేసిన ట్విట్టర్ యూజర్ జియో ఫోన్ 5జీ ధర గురించి కూడా సమాచారం ఇచ్చారు. దీని ధర సుమారు రూ. 10,000 రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. రిలయన్స్ జియో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో జియో ఫోన్ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో ఇప్పుడు 5జీ హ్యాండ్‌సెట్‌ కూడా రానుంది.








Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?