ఐటెల్ విజన్ 3 టర్బో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ వాటర్ డ్రాప్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 


ఐటెల్ విజన్ 3 టర్బో ధర
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,699గా నిర్ణయించారు. డీప్ ఓషన్ బ్లూ, జ్యువెల్ బ్లూ, మల్టీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించనున్నారు.


ఐటెల్ విజన్ 3 టర్బో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6 జీబీ టర్బో ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ వాటర్ డ్రాప్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1,600 పిక్సెల్స్‌గా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బ్లూటూత్ వీ4.2 కనెక్టివిటీ ఫీచర్ ఈ ఫోన్‌లో ఉంది.


ఫింగర్ ప్రింట్ సెన్సార్, జీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, స్మార్ట్ ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లను ఐటెల్ విజన్ 3 టర్బోలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫ్లాష్ చార్జింగ్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే మూడు గంటలు ఫోన్ మాట్లాడటానికి సరిపడా బ్యాకప్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది.


దీని ముందు వెర్షన్ అయిన ఐటెల్ విజన్ 3 కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.7,999గా ఉంది. డీప్ ఓషన్ బ్లాక్, జువెల్ బ్లూ, మల్టీ కలర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ తరహా డిజైన్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ కూడా ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఏఐ బ్యూటీ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్, పనో మోడ్, లో లైట్ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ రికగ్నిషన్, ఆటోమేటిక్ కెమెరా అడ్జస్ట్ మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇందులో ఏఐ బ్యూటీ మోడ్ కూడా అందించారు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?