ఐకూ తన జెడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే ఐకూ జెడ్6 ప్రో 5జీ. ఈ ఫోన్ మనదేశంలో ఏప్రిల్ 27వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్, కొన్ని ఫీచర్లు, చార్జింగ్ స్పీడ్, ప్రాసెసర్, కలర్ ఆప్షన్ల వివరాలను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై పనిచేయనుంది.


66W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో 5.5 లక్షలకు పైగా స్కోరును సాధించింది. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.25 వేలలోపే ఉండనుందని తెలుస్తోంది.


ఇక డిజైన్ విషయానికి వస్తే... ఇప్పటివరకు మనం చూసిన రియల్‌మీ, ఒప్పో, వివో, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల తరహాలోనే దీని డిజైన్ ఉండనుంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా పైభాగంలో, మిగతా రెండు సెన్సార్లు దాని కింద ఉండనున్నాయి.


ఐకూ ఇటీవలే తన నియో 6ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో 6.62 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 1300 నిట్స్‌గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91.4 శాతంగా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో 64 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జీడబ్ల్యూ1పీ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించనున్నారు. ఓఐఎస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఉండనున్నాయి.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?