ఐకూ జెడ్5 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 5జీ ఫీచర్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయింది.
ఐకూ జెడ్5 6000 ఎంఏహెచ్ ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,990గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,990గా ఉంది. మిస్టిక్ స్పేస్, ఆర్క్‌టిక్ డాన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 6000 ఎంఏహెచ్ వేరియంట్ ధర ఎంత ఉండనుందో తెలియరాలేదు.
ఐకూ జెడ్5 6000 ఎంఏహెచ్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఇందులో అందించనున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీని మందం 0.92 సెంటీమీటర్లుగా ఉండనుంది.