ఐకూ నియో 7 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్ అయిన ఐకూ నియో 7కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఒకవేళ మనదేశంలో లాంచ్ అయితే శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీకి ఇది ప్రధాన పోటీదారు కానుంది.


ఐకూ నియో 7 ఎస్ఈ ధర
ఈ ఫోన్‌లో ఐదు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  2,099 యువాన్లుగా (సుమారు రూ.24,800) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 2,299 యువాన్లుగానూ (సుమారు రూ.27,100), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ (సుమారు రూ.29,500) ఉంది.


టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా (సుమారు రూ.33,100) నిర్ణయించారు. వీటితో పాటు 12 జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ కూడా ఉంది. దీని ధర 2,899 యువాన్లుగా (సుమారు రూ.34,300) ఉంది. ఈ ఫోన్ మనదేశంలో కచ్చితంగా లాంచ్ కానుందని కానీ ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ తెలపలేదు.


ఐకూ నియో 7 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఏకంగా 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ అందించనుండటం విశేషం.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. 512 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఐకూ నియో 7 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది. కేవలం 10 నిమిషాల్లోనే 60 శాతం చార్జింగ్ ఈ ఫోన్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?