Paytm Live Train Status:
ఒకప్పుడు రైలు టికెట్లు కావాలన్నా, పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవాలన్నా ఎంతో కష్టమయ్యేది! సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఇప్పుడీ సౌకర్యాలన్నీ సులభంగా మారిపోయాయి. ఇప్పుడు నిత్యం మొబైల్ ఫోన్ మన చేతుల్లోనే ఉంటుంది. దాంట్లో యాప్ ఓపెన్ చేస్తే చాలు! రైలు టికెట్ల బుకింగ్ దగ్గర్నుంచి ఆహారం బుక్ చేసుకోవడం వరకు అన్నీ ఈజీగా అయిపోతున్నాయి. పేటీఎం, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ యూజర్లకు ఎన్నో ఆఫర్లు అందిస్తున్నాయి.
ట్రైన్ లైవ్ స్టేటస్
డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంలో రైలు టికెట్లు బుక్ చేయడం, పీఎన్‌ఆర్ స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేటస్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకు రైలు పేరు, పీఎన్‌ఆర్ నంబర్ ఉంటే చాలు. భారతీయులు సుదూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఎంచుకొనే రవాణా సాధనం రైలు! ఒకప్పుడు రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమయ్యేది. పేటీఎంలో రైలు రన్నింగ్ స్టేటస్ కోసం టికెట్ బుకింగ్‌లో ట్రైన్ టికెట్స్‌పై ట్యాప్ చేయాలి. అందులో సెర్చ్ ట్రైన్స్ కింద పీఎన్‌ఆర్ పక్కన ట్రైన్ స్టేటస్ కనిపిస్తుంది. ట్రైన్ స్టేటస్ నొక్కితే సెర్చ్ ఆప్షన్ వస్తుంది. అందులో మీకు కావాల్సిన రైలు సంఖ్య లేదా రైలు పేరు ఎంటర్ చేయాలి. దాని కింద బోర్డింగ్ స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రయాణించే తేదీనీ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత చెక్ లైవ్ స్టేటస్‌పై నొక్కితే చాలు. లైవ్ రన్నింగ్ స్టేటస్‌తో పాటు రైలు ఏ స్టేషన్‌కు ఎన్ని గంటలకు వెళ్తుంది? ఎంత సమయం ఆలస్యమవుతుందో తెలిసిపోతుంది.
పీఎన్‌ఆర్ స్టేటస్
ఇండియన్ రైల్వే పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకొనేందుకు మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పేటీఎంలో పీఎన్‌ఆర్ నంబర్ ఎంటర్ చేస్తే రైలు రాక, పోక, కోచ్ నంబర్, సీట్ నంబర్, ట్రావెల్ క్లాస్, ఛార్ట్ స్టేటస్, రైలు పేరు, రైలు నంబర్, బుకింగ్ స్టేటస్, కరెంట్ స్టేటస్, ట్రావెల్ టైమ్, టికెట్ ధర అన్నీ కనిపిస్తాయి. ఇందుకోసం మొదట పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. టికెట్ బుకింగ్ సెక్షన్‌లో ట్రైన్ టికెట్ల ఆప్షన్ ట్యాప్ చేయాలి. చెక్ పీఎన్‌ఆర్ ట్యాబ్‌కు వెళ్లాలి. పది అంకెల పీఎన్‌ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. చెక్ నౌ బటన్ కొడితే పీఎన్‌ఆర్ స్టేటస్‌కు సంబంధించిన అన్ని విషయాలు తెరపై ప్రత్యక్షమవుతాయి.
Also Read: క్లైమాక్స్‌కు చేరుకున్న కేర్ హాస్పిటల్స్ మెగా సేల్, ₹8,000 కోట్లకు బ్లాక్‌స్టోన్ రెడీ
Also Read: రెపో రేట్ల పెంపుతో ఈఎంఐల భారమే కాదండోయ్! ఇలా లాభమూ ఉంది!