RBI rate Hikes: రెపో రేట్ల పెంపుతో ఈఎంఐల భారమే కాదండోయ్! ఇలా లాభమూ ఉంది!
ఆర్బీఐ విధాన రేటు పెంపుతో నెలసరి వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న ఈఎంఐలతో ఇంటిని నడపలేమని బాధపడుతున్నారు. అయితే రెపోరేట్ల పెంపుతో భారమే కాదు అభయమూ ఉందండోయ్! ఎందుకంటే కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 7.5 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅవసరానికి ఆదుకుంటాయని చాలా మంది బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం తెలిసిందే. పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్నవి కాస్త అధికంగానే వడ్డీని ఇస్తుంటాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. అయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్, డీసీబీ బ్యాంకుల్లో సగటున నెలకు రూ.2000 నుంచి రూ.5000 వరకు మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో రూ.2500 నుంచి రూ.10వేల వరకు ఉండాలి.
బంధన్ బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 6.5 శాతం వడ్డీ అందిస్తున్నాయి. సీఎస్బీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకుల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.2500 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. బంధన్ బ్యాంకుకూ ఇదే వర్తిస్తుంది.
సౌతిండియన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 6 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకులో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.1500 నుంచి రూ.10వేల వరకు ఉండాలి. సౌతిండియన్ బ్యాంకులో ఇది రూ.1000 నుంచి రూ.2500 వరకు ఉంటుంది.