iPhone 17e Feature, Price: యాపిల్ కంపెనీ ఎట్టకేలకు ఐఫోన్ 17eని లాంచ్ చేసింది. ఇందులో A19 ప్రాసెసర్‌తో సహా పలు ఫీచర్లలో అప్‌గ్రేడ్లు అందించారు. అయితే, యాపిల్ ఈ ఫోన్‌లో డైనమిక్ ఐలాండ్ ఇస్తుందని ముందుగా అంచనా వేసినా, అది అందుబాటులోకి రాలేదు. ఈ మోడల్ నాచ్‌తోనే లాంచ్ అయింది. ఐఫోన్‌ 17ఈలో ఏమేం ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ వేటితో పోటీ పడుతుంది, దీని కోసం మీరు ఎంత ఖర్చు చేయాలి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement

ఐఫోన్ 17e స్పెసిఫికేషన్లుఈ ఐఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఇచ్చారు. ఇది 1200 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మొబైల్‌పై గీతలు పడకుండా చూసేందుకు, గ్లేర్ (బ్రైట్‌నెస్) తగ్గించడానికి దీనిపై 'సిరామిక్ షీల్డ్ 2' (Ceramic Shield 2) ఇచ్చారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐఫోన్ 17eకి IP68 రేటింగ్ లభించింది. ప్రాసెసర్ విషయానికి వస్తే, యాపిల్ ఇందులో ఐఫోన్ 19 లో ఉండే A19 చిప్‌సెట్‌ను అమర్చింది. ఇది అడ్వాన్స్‌డ్ 3nm టెక్నాలజీతో రూపొందించారు. ఇది పాత మోడళ్లతో పోలిస్తే వేగవంతమైన పనితీరు అందిస్తుంది. ఆన్-డివైస్ AI ప్రాసెసింగ్ కోసం ఇందులో 16 కోర్ న్యూరల్ ఇంజిన్ అమర్చారు. .

కెమెరా, బ్యాటరీఐఫోన్ 17e వెనుక భాగంలో 48MP సింగిల్ ఫ్యూజ్ కెమెరా సిస్టమ్ సెట్ చేశారు. ఇది 2x టెలిఫోటో ఆప్టికల్-క్వాలిటీని సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ కెమెరాతో యూజర్లు 24MPతో పాటు 48MP రిజల్యూషన్‌లో ఫొటోలు, వీడియోలు షూట్ చేయవచ్చు. అలాగే ఇందులో 4K వీడియో రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. కొత్త చిప్‌సెట్, C1X మోడెమ్ వల్ల బ్యాటరీ సామర్థ్యం మెరుగైందని యాపిల్ పేర్కొంది. ఈ డివైస్ ఫాస్ట్ ఛార్జింగ్, మాగ్‌సేఫ్ (MagSafe), Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయింది.

Continues below advertisement

శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లుఐఫోన్ 17e శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది. సాధారణ నెట్‌వర్క్ కవరేజ్ లేని సమయంలో కూడా యూజర్లు శాటిలైట్ ద్వారా మెసేజ్‌లు, ఎమర్జెన్సీ SOS, రోడ్‌సైడ్ అసిస్టెంట్ సహా లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు. దీనితో పాటు ఇందులో 'క్రాష్ డిటెక్షన్' ఫీచర్‌ను కూడా ఇచ్చారు. 

ధర ఎంత, అమ్మకాలు ఎప్పుడు ప్రారంభం?యాపిల్ ఈ ఐఫోన్‌ను బ్లాక్, వైట్, సాఫ్ట్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. భారత్‌లో ఐఫోన్ 17ఈ ప్రారంభ ధర రూ. 64,900గా నిర్ణయించారు. మార్చి 4 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మార్చి 11 నుండి ఈ ఐఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. కంపెనీ దీని స్టాండర్డ్ స్టోరేజ్‌ను 256GBకి పెంచింది. 

గూగుల్ పిక్సెల్ 10a (Google Pixel 10a)తో పోటీయాపిల్ ఈ లేటెస్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 10aతో పోటీ పడనుంది. కొద్ది రోజుల కిందట లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10aలో 6.3 అంగుళాల Actua డిస్ప్లే, టెన్సర్ G4 ప్రాసెసర్, వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10ఏ ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంది.