Google Play Store: ఆండ్రాయిడ్ వినియోగదారుల భద్రతపై Google ఫోకస్ చేసింది. ఈ క్రమంలో Play Storeపై చర్యలు మొదలుపెట్టింది. ప్లే స్టోర్ నుంచి ఏకంగా 17.5 లక్షల కంటే ఎక్కువ అనుమానాస్పద, Fake Appsను ప్లాట్‌ఫారమ్ నుంచి గూగుల్ తొలగించింది. దీంతో పాటు దాదాపు 80,000 డెవలపర్ అకౌంట్స్‌ను పర్మినెంట్‌గా బ్లాక్ చేసింది. 2026లో Android ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా ఇది కీలక అడుగు అని చెప్పవచ్చు. 

Continues below advertisement

మాల్వేర్, స్కామ్‌లతో నిండిన యాప్స్గూగుల్ రిమూవ్ చేసిన మెజారిటీ యాప్‌లలో ప్రమాదకరమైన మాల్వేర్ ఉంది. ఈ యాప్‌లు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయగలవు. యూజర్లకు సమాచారం లేకుండా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను సైతం యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయగలవు అని గూగుల్ భావించింది. అనేక యాప్‌లు యూజర్ల ప్రైవసీకి ప్రత్యక్ష ముప్పుగా మారాయి. తన AI ఆధారిత భద్రతా వ్యవస్థ ఈ యాప్‌లను ముందే గుర్తించిందని, దాంతో అలాంటి యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు Google ప్రతినిధులు తెలిపారు. 

2.55 లక్షల యాప్‌ల డేటా యాక్సెస్ నిలిపివేతGoogle సేఫ్టీ టెక్నాలజీ దాదాపు 2.55 లక్షల యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటాను యాక్సెస్ చేయకుండా ముందే బ్లాక్ చేసింది. దాంతో డేటా చోరీ ముప్పుతో పాటు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం నుంచి యూజర్లను సంస్థ కాపాడింది. 

Continues below advertisement

80 వేల మంది డెవలపర్‌లపై శాశ్వత నిషేధంతమ రూల్స్ పదేపదే ఉల్లంఘించిన, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన డెవలపర్స్ అకౌంట్లను తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో Play Storeలోకి రాకుండా గూగుల్ వాటిపై నిషేధం విధించింది. వినియోగదారుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత అని, అందుకే ఇలాంటి ఖాతాలకు మళ్లీ అవకాశం ఇవ్వబోమని గూగుల్ స్పష్టం చేసింది.

Play Storeలో నిఘా, కొత్త పాలసీAndroid ప్లాట్‌ఫారమ్‌ను మరింత క్లీన్‌గా, సురక్షితంగా ఉంచే లక్ష్యంలో భాగంగా గూగుల్ ఈ చర్యలు తీసుకుంది. లక్షల యాప్స్ తొలగించడంతో పాటు డెవలపర్స్ అకౌంట్లను సైతం బ్యాన్ చేసింది. యాప్‌లను వాటి ప్రారంభ స్టేజ్ నుండే AI టూల్స్ ద్వారా తనిఖీ చేస్తున్నారు. మాల్వేర్, స్పైవేర్ లేదా ఫేక్ యాక్టివిటీలను త్వరగా గుర్తించేందుకు ఈ టూల్స్ Android Studio, Play Store లోని డేటా సేఫ్టీ సెక్షన్‌తో అనుసంధానించారు. కేవలం యాప్‌లే కాకుండా, వినియోగదారులు తప్పుడు రేటింగ్‌లను చూసి మోసపోకుండా ఉండేందుకు కంపెనీ 16 కోట్లకు పైగా ఫేక్ రివ్యూలు, ఫేక్ రేటింగ్‌లను కూడా తొలగించింది.

భారత వినియోగదారులకు కూడా ప్రయోజనంగూగుల్ తాజా చర్యల వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న Android వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఫేక్ యాప్స్, ఆన్‌లైన్ మోసాల నుంచి కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకోనుంది గూగుల్. ఇక మరింత సురక్షితమైన డౌన్‌లోడ్స్ యూజర్ల డేటాతో పాటు బ్యాంక్ ఖాతాలను రక్షించడం దీని ఉద్దేశం. తమ చర్యలు ఇక్కడితో ఆగవని Google స్పష్టం చేసింది. రాబోయే కాలంలో AI ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ మరింత బలోపేతం చేస్తామని, తద్వారా Play Store గతంలో కంటే మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా మారుతుందని పేర్కొంది.