యాపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్ 2023లోనే అత్యంత పవర్ ఫుల్ ఫోన్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ అయిన టీఎస్ఎంసీ త్వరలో3ఎన్ఎం ప్రాసెసర్‌ను రూపొందించడానికి సిద్ధం అవుతోంది. 2023లో అందించనున్న యాపిల్ ఫోన్లలో ఇదే ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఇదే తరహా చిప్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌లో కూడా అందించనున్నారని తెలుస్తోంది. కానీ ఈ ప్రాసెసర్ 2024లో లాంచ్ కానుంది. ఐఫోన్ 15 సిరీస్ మాత్రం 2023లోనే రానుంది. కాబట్టి 2023లో రానున్న మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్లు ఐఫోన్ 15 సిరీస్‌నే కానుంది.


ఇక ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7వ తేదీన మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000) నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. అంటే మనదేశంలో దాదాపు రూ.75 వేల నుంచి రూ.80 వేల మధ్యలో దీని ధర ఉండనుంది.


ట్రెండ్ ఫోర్స్ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం ఐఫోన్ 14 ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000), ఐఫోన్ మ్యాక్స్ ధర 849 డాలర్ల (సుమారు రూ.68,000), ఐఫోన్ 14 ప్రో ధర 1,049 డాలర్ల (సుమారు రూ.83,000), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,149 డాలర్ల (సుమారు రూ.91,000) నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


ధర ఎక్కువగా పెంచితే ఆ ప్రభావం సేల్స్‌పై పడుతుందేమోనని యాపిల్ భయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవోల్బణం, ఫారిన్ ఎక్స్‌చేంజ్ రేట్లు పెరుగుతుండటం కూడా ధర విషయంలో యాపిల్ వెనక్కి తగ్గడానికి ఒక కారణం కావచ్చు. ఐఫోన్ 14 ప్రో సిరీస్ మోడల్స్‌లో యాపిల్ ఏ16 బయోనిక్ చిప్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో 48 మెగాపిక్సెల్ కెమెరాలు అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 13 ప్రో సిరీస్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండగా, ఇప్పుడు వాటిని భారీగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వీటితో పాటు ఐఫోన్ 14 మ్యాక్స్ ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


ఐఫోన్ 14 మ్యాక్స్ ఫీచర్లు (అంచనా)
లీకైన వివరాల ప్రకారం... ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉండనుంది.


యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.


ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!