యాపిల్ తన ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు ఎయిర్ పోడ్స్  ప్రో 2, కొత్త యాపిల్ వాచ్‌లను సెప్టెంబర్ ఈవెంట్‌లో లాంచ్ చేయనుంది. అయితే ఈ ప్రణాళికల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో లాక్‌డౌన్‌ల కారణంగా ఆ దేశంలోని యాపిల్ సప్లయర్లు విడిభాగాలను సప్లై చేయడంలో ఆలస్యం జరుగుతోందని సమాచారం. ఇదే నిజమైతే యాపిల్ కొత్త ఉత్పత్తుల లాంచ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.


ఐఫోన్ 14 ప్రోలో అప్‌గ్రేడ్ చేసిన ప్రోమోషన్ డిస్‌ప్లే ప్యానెల్ ఉండనుందని సమాచారం. ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేను కూడా సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ల విడిభాగాలను సప్లై చేసే కంపెనీల్లో ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ పెద్ద సంస్థలని తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో లాక్‌డౌన్‌ల కారణంగా ఈ కంపెనీలు వాటి ఫ్యాక్టరీలు తెరవడంలో ఆలస్యం అవుతోంది. దీంతో ఉత్పత్తి కూడా ఆలస్యం కానుంది.


ఒకవేళ ఈ ఆలస్యం ప్రభావం స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిపై పడితే యాపిల్ ఎనిమిది బిలియన్ డాలర్ల (సుమారు రూ.62,097 కోట్లు) రెవిన్యూని కోల్పోనుందని తెలుస్తోంది. సాధారణంగా కొత్త ఐఫోన్ మోడల్స్ అన్నీ జూన్ నాటికి ఇంజినీరింగ్ వెరిఫికేషన్ టెస్ట్ (ఈవీటీ) స్టేజ్‌లోకి జూన్‌లో ఎంటర్ అవుతాయి.


కానీ వీటిలో ఒక మోడల్ మాత్రం ఆశించిన టైం కంటే కనీసం మూడు వారాలు ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రొడక్షన్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే అనుకున్న షెడ్యూల్‌కు లాంచ్ కావాలంటే మాత్రం లాక్‌డౌన్‌ల నుంచి కోలుకుని సప్లై చైన్‌ను వేగంగా రీస్టోర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫోన్‌ను ముందే లాంచ్ చేసినా... సేల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!