ఇన్‌ఫీనిక్స్ నోట్ 12ఐ స్మార్ట్ ఫోన్ ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ మొదట కెన్యాలో లాంచ్ చేశారు. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి.


ఇన్‌ఫీనిక్స్ నోట్ 12ఐ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 20,500 కెన్యా షిల్లింగ్‌లుగా (సుమారు రూ.13,600) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మిత్రిల్ గ్రే, హేజ్ గ్రీన్, మిస్ట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఇన్‌‌ఫీనిక్స్ నోట్ 12ఐ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.82 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1640 పిక్సెల్స్‌గా ఉంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ. టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉండటం విశేషం. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 1 టీబీ వరకు స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ర్యామ్‌ను ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 3 జీబీ పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, క్యూవీజీఏ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఇన్‌ఫీనిక్స్ ఎక్స్ఓఎస్ 10.6 కస్టం స్కిన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... దీంతోపాటు 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డీటీఎస్ టెక్నాలజీ ద్వారా మ్యూజిక్,వీడియోలు ఎంజాయ్ వచ్చేయవచ్చు.