Smart Phone Care Tips: దేశవ్యాప్తంగా వేవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఇది 45 డిగ్రీలు దాటి పోవచ్చని కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేడి మరింత పెరిగి అవకాశం లేకపోలేదు. ఈ తీవ్రమైన వేడి కేవం మనుషులకే కాదు, మనం నిరంతరం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లు కొంత మేర వేడిని తట్టుకోగలవు. కానీ పరిసరాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి ఓవర్ హీటింగ్ సమస్యకు గురవుతాయి. ఫోన్ వేడెక్కినప్పుడు దాని పనతీరు నెమ్మదిస్తుంది. కొన్ని సార్లు ఫోన్ హ్యాంగ్ అవుతుంది. లేదా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఈ సమస్యల నుంచి మీ స్మార్ట్ ఫోన్ కాపాడుకోవడానికి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించాలి
చాలా మంది ఫోన్ డిస్‌ప్లే స్పష్టంగా కనిపించాలని ఫుల్ బ్రైట్‌నెస్ పెడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌కు చాలా ఎక్కువ పవర్ అవసరం. బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బ్యాటరీ వేగంగా వేడెక్కుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచడం, లేదా ఆటో బ్రైట్‌నెస్ మోడ్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం. దీని వల్ల బ్యాటరీపై లోడ్ తగ్గి, ఫోన్ చల్లగా ఉంటుంది.
ఫ్లైట్ మోడ్ యూజ్ చేయాలి
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ఫోన్ అవసరం లేనప్పుడు దానిని ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఫోన్ కంటిన్యూగా నెట్‌వర్క్ సిగ్నల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రక్రియ వల్ల ఇంటర్నల్ పార్ట్స్ వేడెక్కుతాయి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల నెట్‌వర్క్ కనెక్షన్‌లు తాత్కాలికంగా ఆగిపోతాయి. దీని వల్ల ఫోన్ ఇంటర్నల్ సర్క్యూట్‌లకు విశ్రాంతి దొరుకుతుంది.
ఫోన్ కవర్‌ను తొలగించడి
ఫోన్ కింద పడినా పాడవకుండా ఉండాలని సెక్యూరిటీగా కవర్లు వేస్తారు. కానీ వేసవిలో ఈ కవర్లు ఫోన్ నుంచి వచ్చే వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. దీని వల్ల ఫోన్‌లో వెంటిలేషన్ ఉండదు. కాసేపు వాడిని ఫోన్ సెగలు కక్కుతుంది. ఫోన్ చార్జ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కువ వాడుతున్నప్పుడు మొబైల్ కవర్‌ను తీసివేస్తే, లోపల వేడి బయటకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది.
ఎండలో ఫోన్ వాడొద్దు
వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండలో ఫోన్ ఉపయోగించొద్దు. ఎండలో ఫోన్ వాడితే రెండు విధాల నష్టం. ఒకటి సూర్యుడి వేడి వల్ల ఫోన్ వేడెక్కడం. రెండోది ఆ ఎండలో స్క్రీన్ కనిపించడం కోసం మనం బ్రైట్‌నెస్ పెంచడం వల్ల బ్యాటరీ వేడెక్కడం. ఈ డబుల్ డోస్ వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడూ నీడలో లేదా చల్లని ప్రదేశంలో ఫోన్ వాడటం మంచిది.
ఓవర్ ఛార్జింగ్ వద్ద
చాలా మంది రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వదిలేస్తారు. ఫోన్ 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత కూడా ప్లగ్‌లోనే ఉంచితే అది బ్యాటరీలో అనవసరమైన వేడికి కారణమవుతుంది. ఈ వేడి వల్ల ఫోన్ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కాబట్టి, ఛార్జింగ్ పూర్తి అయిన వెంటనే ప్లగ్ నుంచి తీసేయాలి.
ఎందుకు ఫోన్‌లు హీటెక్కుతాయి?
స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే లిథియం- అయాన్ బ్యాటరీలు ఉష్ణోగ్రత పట్ల చాలా సున్నితంగా ఉంటాయి. పరిసరాల ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరినప్పుడు ఫోన్ లోపల ఉండే ప్రాసెసర్, బ్యాటరీ నిర్వహించే రసాయన చర్యల వల్ల ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఈ వేడి కేవలం ఫోన్ వేగం తగ్గించడమే కాకుండా, చిప్ సెట్‌ను శాశ్వతంగా దెబ్బ తీసే అవకాశం ఉంది.
