iPhone కొనాలని చాలా మంది కలలు కంటారు. అయితే తమ వద్ద అంత బడ్జెట్ లేకపోవడంతో ఎక్కడైనా తక్కువ ధరకు దొరుకుతుందా అని చూసి మోసపోతుంటారు. కానీ మార్కెట్‌లో నకిలీ ఐఫోన్ (Fake iPhone)లను కూడా చాలా తెలివిగా విక్రయిస్తున్నారు. ఇవి చూడటానికి అసలు ఫోన్లలాగే అనిపిస్తాయి. కానీ వీటి పనితీరు కాస్త తక్కువగా ఉంటుంది. వాటి ద్వారా సేఫ్టీ ఉండదు. మీకు ఏదైనా నష్టం జరిగినా Apple నుండి ఎటువంటి అధికారిక సపోర్ట్ లభించదు. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా షాపులో iPhone కొనుగోలు చేస్తున్నట్లయితే, మోసపోకుండా ఉండటానికి దాని అసలైన గుర్తింపును చెక్ చేసి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
IMEI నంబర్‌తో వెంటనే గుర్తించండి
IMEI నంబర్‌ను చెక్ చేయడం అత్యంత సులభమైన మార్గం. మీ ఫోన్‌లో *#06# డయల్ చేయండి. స్క్రీన్‌పై మీకు IMEI నంబర్ కనిపిస్తుంది. ఆ తర్వాత Apple అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ నంబర్‌ను ఎంటర్ చేసి చెక్ చేయండి. ఒకవేళ ఆ నంబర్ తప్పుగా లేదా తెలియనిదిగా కనిపిస్తే, ఆ ఫోన్ ఫేక్ ఐఫోన్ అని అర్థం చేసుకోండి.
సీరియల్ నంబర్‌తో నిర్ధారణ
ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి General > Aboutలో సీరియల్ నంబర్‌ను చెక్ చేయండి. ఈ నంబర్‌ను Apple వారి ‘Check Coverage’ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి వెరిఫై చేయండి. అక్కడ ఎటువంటి సమాచారం లభించకపోయినా లేదా ఎర్రర్ వచ్చినా, అది నకిలీ లేదా అన్‌రిజిస్టర్డ్ డివైజ్ అయ్యే అవకాశం ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్‌తో తేడాను గుర్తించండి
అసలైన iPhone ఎల్లప్పుడూ Apple సొంత సాఫ్ట్‌వేర్ అయిన iOSపై రన్ అవుతుంది. నకిలీ ఫోన్లు తరచుగా Androidపై ఉన్నప్పటికీ, వాటిని iOS లాగా కనిపించేలా చేస్తారు. దీనిని గుర్తించడానికి App Storeను ఓపెన్ చేయండి. ఒకవేళ అక్కడ Google Play Store కనిపిస్తే, ఆ ఫోన్ అసలైనది కాదు.
బిల్డ్ క్వాలిటీ చెక్ చేయాలి
ఒరిజినల్ iPhone ఫినిషింగ్ ప్రీమియంగా ఉంటుంది. మెటల్, గ్లాస్‌తో కూడిన స్ట్రాంగ్ బాడీ, ఖచ్చితమైన డిజైన్, సరైన చోట అమర్చిన బటన్లు ఉంటాయి. అదే నకిలీ ఫోన్లలో లూజ్ బటన్లు, నాణ్యత లేని ఫినిషింగ్ ఉంటే చౌకగా అనిపించే అనుభూతి కలుగుతుంది.
App Storeతో కన్ఫర్మ్ చేయండి
అసలైన iPhoneలో కేవలం Apple App Store మాత్రమే ఉంటుంది. ఫోన్‌లో Google Play వంటి ఇతర యాప్ స్టోర్లు కనిపించాయంటే అది ఆ ఐఫోన్ నకిలీ అని కన్ఫామ్ చేయవచ్చు. అంతేకాకుండా, మీ iPhoneను USB ద్వారా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి iTunes లేదా Finderను తెరవాలి. అసలైన iPhone వెంటనే గుర్తించవచ్చు. కానీ నకిలీ పరికరాలు తరచుగా కనెక్ట్ కావు లేదా సరిగ్గా డిటెక్ట్ అవ్వవు.
Siri, ధర, ప్యాకేజింగ్‌ను గమనించండి
పవర్ బటన్‌ను నొక్కి Siriని ఆన్ చేయండి; ఒకవేళ అది పని చేయకపోతే అనుమానించాలి. అలాగే, చాలా తక్కువ ధరకే లభించే iPhone కూడా ప్రమాదానికి సంకేతం కావచ్చు. ప్యాకేజింగ్, బాక్స్, యాక్సెసరీల నాణ్యతను కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అసలైన Apple ఉత్పత్తులు ఎల్లప్పుడూ ప్రీమియం ప్యాకింగ్‌తోనే మార్కెట్లోకి వస్తాయి.
