How To Free Up Storage On Android Phones:మీ ఫేవరేట్ మూమెంట్స్ క్లిక్ చేస్తుంటే లేదా అర్జెంట్‌గా ఒక యాప్‌ను ఆప్‌డేట్ చేస్తుంటే స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, వాట్సాప్ వీడియోలు, క్యాషే ఫైల్స్ కలిసి స్మార్ట్‌ఫోన్ ఇంట్నల్ మెమొరీని నింపేస్తాయి. దీని వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడం స్లోగా రన్ అవ్వడం లేదా యాప్స్ ఆటోమేటిక్‌గా క్రష్ అవ్వడం వంటి సమస్యలు మొదలవుతాయి. చాలా మంది స్టోరేజ్ క్లియర్ చేయడానికి యాంటీవైరస్ యా్స్ లేదా థర్డ్ పార్టీ క్లీనింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. కానీ, ఇవి స్టోరేజ్ ఖాళీ చేయడం కంటే ీ ప్రైవసీకి ప్రమాదం తెచ్చిపెడతాయి. అంతే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఫోన్ పనితీరును తగ్గిస్తాయి. అయితే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా సింపుల్ ఛేంజెస్‌తో స్టోరేజ్ క్లియర్ చేసే టిప్స్ చూద్దాం.
ఆండ్రాయిడ్ ఇన్ బిల్ట్ స్టోరేజ్ మేనేజర్ ఉపయోగాలు ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో మెమొరీని విశ్లేశించే స్టోరేజ్ మేనేజర్ టూల్ ఉంటుంది. ఇది ఏ కేటగిరి ఎంత మెమొరీ తీసుకుంటున్నాయో చూపిస్తుంది. దీని కోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ అప్ స్పేస్ లేదా మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. సిస్టమ్ ఆటోమేటిక్‌గా డూప్లికేట్ ఫైల్స్, టెంప్ ఫైల్స్, లార్జ్ వీడియోలు గుర్తించి, ఒక్క క్లిక్‌తో డిలీట్ చేసే సదుపాయం ఉంటుంది.
యాప్ క్యాషే, అన్ యూజ్డ్ యాప్స్ డిలీషన్
మనం ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్,యూట్యూబ్, క్రోమ్ వంటి యాప్స్ రోజు వారీ వినియోగంలో క్యాషే డేటా రూపంలో జీబీలకు జీబీలు మెమొరీ తినేస్తాయి. దీని కోసం సెట్టింగ్స్‌లో యాప్స్‌లో ఆల్ యాప్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్లి ఎక్కువ స్పేస్ తీసుకుంటున్న యాప్‌ను సెలె్ట్ చేసుకొని స్టోరేజ్, క్యాషీపై ఒత్తండి. క్లియర్ క్యాషీ బటన్ నొక్కండి. ఇక్కడ క్లియర్ స్టోరేజ్, క్లియర్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ లాగిన్ వివరాలు పోతాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ చేయొద్దు. గత కొన్ని నెలుగా వాడని యాప్స్‌ను గుర్తించి అన్ ఇన్‌స్టాల్ చేయడం లేదా గూగుల్ ప్లే స్టోర్‌లోని అర్కేవ్స్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా యాప్ సైజును 60శాతం నుంచి 80శాతం వరకు తగ్గించవచ్చు.
వాట్సాప్ మీడియా మేనేజ్‌మెంట్
స్మార్ట్‌పోన్‌లో స్టోరేజ్ ఫుల్ అవ్వడానికి ప్రధాన కారణం వాట్సాప్. గుడ్‌మార్నింగ్ ఇమేజెస్, గుడ్‌నైట్ వీడియోలు, ఫార్వర్డ్ ఫైల్స్ అన్నీ దాగి ఉండేది ఇందులోనే. అందుకే వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ స్టోరేజ్ అండ్ డేటా మేనేజ్ స్టోరేజ్‌లోకి వెళ్లండి. అక్కడ లార్జర్ దేన్ 5ఎంబీ అని ఉన్న విభాగాన్ని ఓపెన్ చేస్తే, ఫోన్‌లో ఎక్కువ స్పేస్ తీసుకున్న ఫైల్స్ అన్నీ వరుసగా కనిపిస్తాయి. మీకు అవసరం లేని పెద్ద వీడియోలను అక్కడ నుంచి నేరుగా సెలెక్ట్ చేసి డిలీట్ చేయవచ్చు. ఆటో డౌన్‌లోడ్ ఆపేస్తే ఇంకా మంచిది. దీని కోసం సెట్టింగ్స్ స్టోరేజ్ అండే డేటా అన్ యూజింగ్ మొబైల్ డేటాలో ఫొటోలు, వీడియోలు ఆటో డౌన్‌లోడ్ కాకుండా అన్ చెక్ చేయండి. అంటే టిక్ మార్కు తీసేయండి.
గూగుల్ ఫొటోస్
ఫోన్‌లోని పాత ఫొటోలు, హెచ్‌డీ వీడియోలను ఇంటర్నల్ మెమొరీలో ఉంచే బదులు గూగుల్ అకౌంట్‌లో బలమైన బ్యాకప్ తీసుకోవడం మంచిది. గూగుల్ ప్రతి అకౌంట్‌కు ఉచితంగా 15జీబీ క్లోడ్ స్టోరేజ్ అందిస్తుంది. గూగుల్ ఫొటోస్ యాప్‌లోకి వెళ్లి ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఫ్రీ అప్ స్పేస్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పటికే గూగుల్ క్లౌడ్‌లో బ్యాక్ అయిన ఫొటోలు మీ ఫొన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి సురక్షితంగా డిలీట్ అయి, గిగాబైట్ల కొద్దీ స్పేస్ ఉచితంగా లభిస్తుంది.
ఫైల్స్ బై గూగుల్ యాప్‌తో లార్జ్ ఫైల్స్ స్వీపింగ్
స్టాక్ అండ్రాయిడ్, బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లలో లభించే ఫైల్స్‌బై గూగుల్ ఒక అద్భుతమైన క్లీనింగ్ టూల్. ఈ యాప్‌ను ఓపెన్ చేయగాని క్లీన్ ట్యాబ్ కింద డూప్లికేట్ ఫొటోలు, మీమ్స్ డౌన్‌లోడ్ ఫోల్డర్‌లోని వేస్ట్ పీడీఎఫ్‌లు, 50ఎంబీ కంటే ఎక్కువ పరిమాణం ఉన్న పెద్ద వీడియోలను విడివిడిగా చూపిస్తోంది. కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే 5జీబీ నుంచి 20 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను రిస్క్ లేకుండా ఖాళీ చేసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ర్యామ్ క్లీనర్స్, ఫోన్ బూస్టర్, బ్యాటరీ సేవర్ వంటి యాప్స్‌ను అస్సు ఇన్‌స్టాల్ చేయొద్దు. ఇవి మీ డేటాని ట్రాక్ చేస్తుంటాయి. మీ ఫోన్ పనితీరును దెబ్బతీస్తాయి.
