iPhone 17 Models |యాపిల్ ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ వచ్చేసింది. ఈ నెల 9న యాపిల్‌ పార్క్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో యాపిల్‌ 17 సిరీస్‌ ఫోన్లను సంస్థ లాంచ్‌ చేసింది. మొత్తం నాలుగు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. వీటిలో ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ ఐఫోన్‌ 17 ప్రో మాక్స్‌ను యాపిల్‌ అందుబాటులోకి తెచ్చింది.

Continues below advertisement


అయితే ఐఫోన్ 17 ప్రో (256 GB) ఫోన్​ను ఏయే దేశ పౌరులు ఎన్ని రోజుల కష్టార్జితంతో కొనుగోలు చేయవచ్చో వరల్డ్​ ఆఫ్​ స్టాటిస్టిక్స్​ సంస్థ తెలియజేసింది. భారత్​ సహా మొత్తం 33 దేశాల పౌరులు యావరేజ్​గా ఎన్ని రోజుల వేతనంతో కొనుగోలు చేయవచ్చో తెలిపింది. ఇందుకు సంబంధించి ఎక్స్​లో ఓ పోస్ట్​ పెట్టింది.


లక్సెంబర్గ్​లో 3 రోజులే..
లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్‌ దేశాలకు చెందిన వారు iPhone 17 Proను సొంతం చేసుకునేందుకు కేవలం 3 రోజుల వేతనాలు అవసరం. ఆ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్  నార్వే దేశాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం నాలుగు రోజులు పని సరిపోతుంది.






భారత్​లో 6 నెలలు కష్టపడాల్సిందే..
అయితే అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మాత్రం ఈ ప్రీమియం ఐఫోన్లు నెలల ఆదాయాన్ని వెచ్చించాల్సిందే. iPhone 17 Proను కొనుగోలు చేయాలంటే భారతదేశంలో సగటు కార్మికుడు 160 రోజులు పని చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 6 నెలలు కష్టపడాలి. సర్వే చేసిన 33 దేశాల్లో ఇదే అత్యధికం. ఇక ఫిలిప్పీన్స్​లో ప్రజలు సాధారణంగా 101 రోజులు, వియత్నాంలో 99 రోజులు, టర్కీలో 89 రోజులు, బ్రెజిజ్​లో 77 రోజులు కష్టపడితే ఐఫోన్​ను దక్కించుకోవచ్చు.


ఆ దేశాల్లో 5, 6 రోజుల్లోనే..
ఇక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో కొనుగోలు శక్తి ఎక్కువగానే ఉంది. జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫిన్లాండ్ మరియు ఆస్ట్రియా దేశాల ప్రజలు కేవలం ఐదు వేతనాలతో iPhone 17 Proను కొనొచ్చు. ఫ్రాన్స్ మరియు స్వీడన్​లో 6 రోజులు, యూకే, న్యూజిలాండ్​లో 7 రోజుల్లో కొనుగోలు చేయవచ్చు.


ప్రతిరోజు 8 గంటల పనిదినాలతో లెక్కింపు
మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థలైన స్పెయిన్​లో 9 రోజులు, చెకియాలో 12 రోజులు, పోలాండ్ లో 17 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఇక పోర్చుగల్​లో 24 రోజులు, హంగేరీలో 27 రోజులు, చిలీలో 32 రోజులు కార్మికులు పనిచేయాలి. ఈ సూచికను ప్రతి దేశంలో సగటు రోజువారీ వేతనంతో భాగించి, 8 గంటల పనిదినాలతో లెక్కించారు.


భారత్​లో ధరలు ఇలా..
యాపిల్ సంస్థ ఈ సారి బేస్ మోడల్ ఐఫోన్ 17లో ప్రో-లెవల్ ఫీచర్లు చేర్చింది. ఐఫోన్ 17 ధరలు, వేరియంట్లు (భారతదేశం) ఐఫోన్ 17 బేస్ మోడల్ 256GB స్టోరేజ్‌తో రూ.82,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB వేరియంట్ ధర రూ. 1,02,900. భారత్​లో సెప్టెంబర్ 19 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది.