గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ సంవత్సరమే మార్కెట్లో లాంచ్ కానున్నాయి. లేటెస్ట్ ప్రాసెసర్ టెన్సార్, అల్యూమినియం కెమెరా మోడల్స్‌ను ఇందులో అందించారు. పిక్సెల్ బ్రాండెడ్ ట్యాబ్లెట్ కూడా త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇది 2023లో లాంచ్ కానుందని సమాచారం.


పిక్సెల్ 7 సిరీస్
గూగుల్ త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్ షిప్ ఫోన్లు పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో. ఈ సంవత్సరంలోనే ఇవి మార్కెట్లో లాంచ్ కానున్నాయి. తర్వాతి తరం గూగుల్ టెన్సార్ ప్రాసెసర్లను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి.


ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను కూడా గూగుల్ ప్రదర్శించింది. బార్ ఆకారంలో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో తరహాలో గ్లాస్‌తో కాకుండా వీటిని అల్యూమినియంతో రూపొందించారు. పిక్సెల్ 7లో వెనకవైపు రెండు కెమెరాలు, పిక్సెల్ 7 ప్రోలో మూడు కెమెరాలు ఉండనున్నాయి.


గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలు ఇందులో ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో ట్యాబ్లెట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. టెన్సార్ ప్రాసెసర్‌తోనే ఈ ట్యాబ్లెట్ లాంచ్ కానుంది. ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను గూగుల్ త్వరలో వెల్లడించనుంది.