HiOS 15:  మీరు టెక్నో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా అయితే ఇది మీకు గుడ్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు మీ పాత ఫోన్ కూడా కొత్తగా కనిపించబోతోంది. టెక్నో తన వినియోగదారుల కోసం HiOS 15 అనే తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందించింది, ఇది ఒక సాధారణ అప్‌గ్రేడ్ మాత్రమే కాదు, మీ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.  

స్మార్ట్‌నెస్ గురించి చెప్పాలంటే 

టెక్నో సొంత వాయిస్ అసిస్టెంట్ ఎల్లాకు ఇప్పుడు కొత్త భాషలు కూడా గుర్తిస్తుంది. సమాధానాలు చెబుతుంది. దీనిలో మరిన్ని భాషలకు సంబంధించిన వాటితో అప్‌డేట్ చేశరు. ఇప్పుడు మీరు హిందీతో పాటు బెంగాలీ, గుజరాతీ, తెలుగు, తమిళం, మరాఠీ వంటి భాషల‌్లో కూడా ఎల్లాతో మాట్లాడవచ్చు. ఈ ఫీచర్ సాంకేతిక ప్రయోజనాన్ని తమ మాతృభాషలో పొందాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.

ఎల్లా ఇప్పుడు మాట్లాడేది మాత్రమే కాదు, అర్థం చేసుకునేది కూడా

 లైవ్‌లోే ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్‌లేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సరికొత్త  ఫీచర్ చాలా మందిి ఆకట్టుకోనుంది.  అంటే, మీరు వేరే భాష మాట్లాడే వ్యక్తితో మాట్లాడుతున్నా సరైన దాన్ని మీరు మీ మాతృభాషలో అనువాదం పొందగలరు.  అంతేకాకుండా, ఈ స్మార్ట్ చాట్‌బాట్ ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతోపాటు ముఖ్యమైన విషయాల సారాంశాన్ని మీకు అందిస్తుంది.

వేగవంతమైన పనితీరు కోసం అనవసరమైన భారాన్ని తగ్గించారు

HiOS 15 మరో ముఖ్య లక్షణం ఏమిటంటే, ఇప్పుడు మీ ఫోన్‌లో ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల సంఖ్య తగ్గించుకోవచ్చు. దీనివల్ల స్టోరేజ్ ఆదా అవుతుంది  ఫోన్ పని తీరు మెరుగుపడుతుంది. కొత్త యానిమేషన్లు, MemFusion 3.0 వంటి ఫీచర్ల సహాయంతో మల్టీటాస్కింగ్ మరింత సులభం అవుతుంది.

AI సహాయంతో ఇప్పుడు మీ గోప్యత మరింత భద్రం

ఫోన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని HiOS 15లో కొన్ని స్మార్ట్ ఫీచర్లు యాడ్ చేశారు.  ఇప్పుడు ఏ యాప్ మీ సరైన సమాచారాన్ని  చోరీ చేసేందుకు వీలు ఉండదు.  ఎందుకంటే 'బ్లాంక్ డేటా' అనే ఫీచర్ అది నకిలీ డేటాను బ్లాక్ చేస్తుంది. అంతేకాకుండా, AI స్క్రీన్‌షాట్ ఇప్పుడు OTP లేదా కాంటాక్ట్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఆటోమేటిక్‌గా బ్లర్ చేస్తుంది.

ఫోటోగ్రఫీలో కూడా స్మార్ట్ టచ్  

 ఫోన్‌తో అద్భుతమైన ఫోటోలు తీయడం ఇష్టపడేవారి కోసం, HiOS 15లో కొన్ని ఆసక్తికరమైన టూల్స్‌ తీసుకొచ్చారు. ఇప్పుడు AI ఎరేజర్ 2.0తో ఫోటోలో అనవసరమైన వ్యక్తులు లేదా వస్తువులను తొలగించడం సులభం చేసింది.  ఇమేజ్ ఎక్స్‌టెండర్ సహాయంతో మీరు మీ ఫోటో ఫ్రేమ్‌ను కూడా పెంచవచ్చు. అంతేకాకుండా వోగే పోర్ట్రెయిట్ , AI వాల్‌పేపర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి మీ ఫోటోలను మరింత ప్రత్యేకంగా తీర్చి దిద్దుతాయి..

HiOS 15 కేవలం ఒక అప్‌డేట్ మాత్రమే కాదు, మీ ఫోన్‌ను కొత్తగా చేసే టూల్‌గా మారనుంది. కొత్త ఇంటర్‌ఫేస్, లాంగ్వేజ్ ఫెసిలిటీ, స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఇప్పుడు మీ టెక్నో స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్ చేయడానికి సమయం వచ్చింది. కాబట్టి ఆలస్యం చేయవద్దు, సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెంటనే అప్‌డేట్‌ను చెక్ చేసి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పొందండి!

ఈ ఫోన్ల అప్‌డేట్ల గురించి కూడా తెలుసుకోండి 

  • సామ్‌సంగ్ తన Galaxy S23, S24 సిరీస్‌ల కోసం One UI 6.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇందులో Galaxy AI వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 
  • iOS 17.5 అప్‌డేట్ త్వరలోనే ప్రారంభం కానుంది, ఇందులో App Store బయట యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వంటి కొత్త ఫీచర్ ఉంటుంది (EU కోసం ప్రత్యేకం).
  • Xiaomi 13, Redmi Note 13 Pro సిరీస్‌లలో HyperOS అప్‌డేట్ రావడం ప్రారంభమైంది, ఇది MIUI స్థానంలో ఉంటుంది.