శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 సిరీస్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. వీటిలో అన్నిటి కంటే హైఎండ్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 200 మెగాపిక్సెల్ కంటే మెరుగైన పనితీరు కనిపించే సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన దాని ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న బెస్ట్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఇదే.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫీచర్లు (అంచనా)
తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇందులో అందించే సెన్సార్లు మెరుగైన హై రిజల్యూషన్ ఫొటోలు అందించనున్నాయి. లో లైట్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని కూడా ఇవి అందించనున్నాయి. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ కెమెరాల్లో అతిపెద్ద కెమెరా ఇంప్రూవ్‌మెంట్‌ను ఈ ఫోన్‌లో అందించారు.


ఇక డిజైన్ విషయానికి వస్తే... దీని డిజైన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా తరహాలోనే ఉండనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో లాంచ్ కానున్న క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ అందించనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇదే క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?