వివో తన 5G హ్యాండ్‌సెట్‌లలో చాలా వరకు స్టాండ్ అలోన్, నాన్-స్టాండ్ అలోన్ 5G నెట్‌వర్క్‌లతో పనిచేసేలా చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. స్టాండ్ అలోన్ నెట్‌వర్క్ 5జీ సిగ్నల్‌ను మాత్రమే ప్రసారం చేస్తుంది. అయితే 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల మిశ్రమంతో కూడిన సిగ్నల్‌ను నాన్-స్టాండలోన్ 5జీ నెట్‌వర్క్ అంటారు.


ప్రస్తుతం రిలయన్స్ జియో స్టాండ్ అలోన్ 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ నాన్-స్టాండలోన్ 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. వివో 5జీ సేవల కోసం 30 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది, ఇవి నాన్-స్టాండలోన్ 5G నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటాయి.


‘వివోలో ఆరు కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు 5జీ SA నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తున్నాయి. మా స్మార్ట్‌ఫోన్‌లు చాలా వరకు NSAకి అనుకూలంగా ఉన్నాయి. మేం ఈ నెలలో మా స్మార్ట్‌ఫోన్‌లలో చాలా వరకు 5G SAకి అనుకూలమయ్యే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తాం.’ అని వివో ఇండియా బిజినెస్ స్ట్రాటజీ హెడ్ పైఘమ్ డానిష్ వివో టెక్ డే సందర్భంగా విలేకరులతో అన్నారు.


ఐడీసీ ప్రకారం వివో భారతదేశంలో మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారు. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికంలో వివో మనదేశంలో 17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 5జీ అనుకూలత సమస్యలను క్రమబద్ధీకరించడానికి, వినియోగదారులందరికీ సేవలను సజావుగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ఇటీవల టెలికాం ఆపరేటర్లు, స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించింది.


రిలయన్స్ జియో నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిన వివో స్మార్ట్‌ఫోన్‌లో సెకనుకు 1.5 జీబీ సాధించడాన్ని లైవ్‌గా టెక్ డేలో Vivo చూపించింది. ఈవెంట్‌లో కంపెనీ తన ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌ను గ్లోబల్, ఇండియన్ మార్కెట్‌ల్లో లాంచ్ తేదీని వెల్లడించకుండా ప్రదర్శించింది.


ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5జీ సేవలను ప్రారంభించారు. అయినప్పటికీ చాలా హ్యాండ్‌సెట్‌లు 5జీ యాక్సెస్‌ని ప్రారంభించడానికి OEMల నుండి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఇంకా అందుకోలేదు. ఐఫోన్ తయారీదారు యాపిల్ తన 5జీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను డిసెంబర్‌లో విడుదల చేయనుంది. అయితే నవంబర్‌లో అప్‌డేట్‌లను విడుదల చేయనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?