Jio vs Airtel: మొబైల్ మన డైలీ లైఫ్‌లో భాగమైనపోయినప్పుడు అంతా బెస్ట్ రీచార్జ్ ప్లాన్ల కోసం వెతుకుతున్నారు. ఏ కంపెనీ మంచి ప్లాన్‌లు అందిస్తుందా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వివిధ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ప్లాన్‌లను సరిపోల్చుకుంటున్నారు. వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ప్లాన్‌లను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఐదు వందల రూపాయలలోపు రెండు కంపెనీలు ఇచ్చే ఫిసిలిటీస్ గురించి వివరిస్తాం. దీన్ని బట్టి మీకు మంచిది అనిపిస్తుందో దాన్ని ఎంచుకోండి.
రీఛార్జ్ ప్లాన్ లేకుండా స్మార్ట్ ఫోన్లు వాడకం అంటే ఊహించుకోలేం. అందుకే మీ బడ్జెట్ బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా అపరిమిత కాల్స్, హై-స్పీడ్ డేటా, OTT ఎంటర్టైన్మెంట్ విషయాలు అవసరమైన తరుణంలో కచ్చితంగా మీకు అన్ని ప్లాన్ల గురించి తెలియాల్సిందే. Jio , Airtel రెండూ రూ.500 కంటే తక్కువ ధరలో అనేక అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని డిజైన్ చేశారు.
Airtel రూ.500 లోపు రీఛార్జ్ ప్లాన్లు
Airtel రూ.301 ప్లాన్‌లో 28 రోజులకు 1GB రోజువారీ డేటా, అపరిమిత కాల్స్ , 3 నెలల Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే Wynk Music, Apollo 24X7 ,, ఉచిత Hellotunes వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
అదనంగా, రూ.398 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, 3 నెలల Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ,, అన్ని Airtel Thanks ప్రయోజనాలు లభిస్తాయి.
- రూ.199 ప్లాన్: మొత్తం 2GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.
- రూ.219 ప్లాన్: 28 రోజులకు 3GB డేటా, రోజుకు 100 SMS.
- రూ.249 ప్లాన్: 1GB/రోజు, 24 రోజులు.
- రూ.299 ప్లాన్: 1GB/రోజు, 28 రోజులు.
- రూ.349 ప్లాన్: 1.5GB/రోజు, 28 రోజుల వ్యాలిడిటీ.
- రూ.355 ప్లాన్: 25GB డేటా, రోజువారీ లిమిట్ లేకుండా.
- రూ.379 ప్లాన్: 2GB/రోజు, 5G యాక్సెస్,, ఇతర అన్ని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ప్రయోజనాలు.
రూ.500 లోపు Jio టాప్ రీఛార్జ్ ప్లాన్లు
Jio రూ.349 ప్లాన్‌లో 2GB/రోజు డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 90 రోజుల Hotstar మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50GB JioAICloud స్టోరేజ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా, Jio రూ.399 ప్లాన్‌లో 2.5GB/రోజు డేటా, మిగిలినవి రూ.349 వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అదేవిధంగా, రూ.449 ప్లాన్‌లో 3GB/రోజు డేటా, 90 రోజుల Hotstar , క్లౌడ్ స్టోరేజ్ - స్ట్రీమింగ్ ప్రేమికులకు అనువైనదిగా చెప్పవచ్చు .
- రూ.198 ప్లాన్: 2GB/రోజు, 14 రోజుల వ్యాలిడిటీ.
- రూ.445 ప్లాన్: 2GB/రోజు, 28 రోజులు, JioTV , JioCinema యాక్సెస్ - కానీ Hotstar ఇవ్వడం లేదు.
ఏ ప్లాన్ మీకు ఉత్తమం?
మీరు OTT ప్రేమికులు , Hotstar యాక్సెస్ కావాలనుకుంటే, Jioకు చెందిన రూ.349, 399 లేదా 449 ప్లాన్లు, Airtel కంపెనీ ఇచ్చే రూ.301 , 398 ప్లాన్లు అద్భుతమైన ఎంపికలు అవుతాయి. అయితే, మీ ప్రాధాన్యత డేటా, కాల్స్ మాత్రమే అయితే, రెండు కంపెనీల రూ.200 నుంచి 400 వరకు ఉన్న నాన్-OTT ప్లాన్లు అందిస్తున్నాయి. అన్ని ప్లాన్లలో అపరిమిత కాల్స్ , 100 SMS/day ఉన్నాయి, తద్వారా మీరు ఏ ఆటంకం లేకుండా ప్రియమైనవారితో కనెక్ట్ అయి ఉండవచ్చు.