Apps Removed From Play store: ఇటీవల గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌ల సంఖ్యను గమనిస్తే.. గతంలో కంటే తక్కువ యాప్‌లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే గూగుల్ డిజిటల్ క్లీనప్ ప్రోగ్రాం చేపట్టింది. వినియోగదారులకు అవసరమైన, ఎలాంటి హానికరం కాని యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించలేదు. వాస్తవానికి 2024 ప్రారంభంలో ప్లే స్టోర్‌లో దాదాపు 34 లక్షల యాప్‌లు ఉన్నాయి, కానీ ఇప్పుడు యాప్‌ల దాదాపు 18 లక్షలకు తగ్గింది. అంటే సగం కంటే ఎక్కువ యాప్‌లు ప్లే స్టోర్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. ఇది వినడానికి విచిత్రంగా, ఏదో తప్పిదం ద్వారా యాప్ తొలగించారని అనిపిస్తుంది కానీ, నిజానికి ఇది వినియోగదారులకు గుడ్ న్యూస్.

Continues below advertisement

ఎందుకు అనేది ఇక్కడ తెలుసుకుందాం:

1. గూగుల్ వేస్ట్ యాప్‌లను ఉపేక్షించదు గతంలో ఏది పడితే ఆ యాప్‌లను ప్లే స్టోర్‌లో ఎవరైనా అప్‌లోడ్ చేసేవారు. ఒకే వాల్‌పేపర్ యాప్, కేవలం టెక్స్ట్ చూపించే యాప్ యాప్ లాంటివి సైతం ప్లే స్టోర్ లో పెట్టేవారు. తరువాత జూలై 2024లో గూగుల్ ఇలాంటి యాప్‌లపై, చైనా యాప్ లపై సైతం నిషేధం విధించింది. అప్పటినుంచి ఏ యాప్ పనికిరాదో దాన్ని ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. మీరు అనవసరమైన లేదా నకిలీ యాప్‌ల నుండి సేఫ్ అని అర్థవుతుంది.

Continues below advertisement

2. వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యంగూగుల్ అనవసర యాప్‌లను మాత్రమే తొలగించలేదు, మీ డేటాను చోరీ చేసే లేదా మీ ఫోన్‌ కండీషన్ దెబ్బతీసే యాప్‌లను కూడా రిమూవ్ చేసింది. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం 2.36 మిలియన్ (అంటే 23 లక్షల 6 వేలకు పైగా) ప్రమాదకర యాప్‌లను గుర్తించి ముందే బ్లాక్ చేశారు. అయితే 1.58 లక్షలకు పైగా చీటింగ్ డెవలపర్లను నిషేధించారు. గూగుల్ నార్మల్,  AI రెండింటితోనూ యాప్‌లను చెక్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు మీరు ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినా, దాని వల్ల మీకు అతి తక్కువ సమస్య తలెత్తే అవకాశం ఉంది. 

 3. కొత్త నిబంధనల వల్ల అనేక డెవలపర్లు స్వయంగా తొలగించుకున్నారు2024లో యూరప్‌లో ఒక కొత్త నిబంధన అమలోకి వచ్చింది, దీనిలో ప్రతి యాప్ మేకర్ తన నిజమైన గుర్తింపును (పేరు, చిరునామా) పూర్తి వివరాలను తప్పకుండా తెలియజేయాలి. అలా చేయకూడదనుకున్న డెవలపర్లు తమ యాప్‌లను స్వయంగా రిమూవ్ చేసుకున్నారు. ఆపిల్‌లో ఈ నిబంధన అమలులోకి వచ్చింది, కానీ అక్కడ యాప్‌ల సంఖ్యపై ప్రభావం చూపలేదు ఎందుకంటే అక్కడ యాప్‌లకు సంబంధించి కఠినమైన నియమాలు ఉన్నాయి.

ఈ చర్యల వల్ల ఫలితం ఏమిటి?

 ఇప్పుడు ప్లే స్టోర్‌లో నిజంగా పనిచేసే, సురక్షితమైన, పారదర్శకమైన యాప్‌లు మాత్రమే ఉంటాయని గూగుల్ స్పష్టం చేసింది. కాబట్టి, ప్లే స్టోర్ నుంచి సగం యాప్‌లు తొలగించినా, మిగిలిన యాప్ లు దాదాపు సురక్షితమైనవగా భావించవచ్చు. డేటా చోరీ చేసే, యూజర్ల ప్రైవసీ దెబ్బతీయడం లాంటి యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించారు. గూగుల్ డిజిల్ క్లీనప్ ద్వార ప్లే స్టోర్ యాప్స్ సురక్షితమైనవని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.