రూపాయి పతనం నేపథ్యంలో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ధరలు అక్టోబర్-డిసెంబర్ కాలంలో  పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అంటే రూ.16,000 కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఈ ఏడాది చివరి నాటికి 5 నుంచి 7 శాతం వరకు పెరుగుతాయి.


పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కారణంగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కాంపోనెంట్ ధరల పెరుగుదల ధరను భరించాయని, అయితే త్వరలో అది మారుతుందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా సెంటర్ (IDC) ప్రకారం ధరల పెరుగుదల పరిశ్రమ సగటు అమ్మకపు ధర (ASP) సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4) రూ.17,000 నుంచి రూ. 20,000 వరకు పెరుగుతుంది. పండుగ సీజన్ అమ్మకాలు ముగిసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరలు 5-7 శాతం పెరుగుతాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది.


అంతకుముందు జూన్‌లో ఈ సంవత్సరం ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ బాగా తగ్గుతుందని ఒక నివేదిక పేర్కొంది. ఈ విభాగం ఇప్పటికే 2022 మొదటి త్రైమాసికం (Q1) షిప్‌మెంట్‌లలో 16 శాతం క్షీణతను చవిచూసింది. రూ.16,000 లోపు విభాగంలో ఇప్పటికే క్యూ1లో షిప్‌మెంట్‌లలో 16 శాతం తగ్గుదల కనిపించింది.


ఇంతలో పండుగ విక్రయాల సీజన్‌లో ఖరీదైన 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరిగింది. నివేదికల ప్రకారం భారతదేశంలో 5జీ సేవలను ప్రారంభించడం ఆన్‌లైన్ ఛానెల్‌లు, ఫిజికల్ రీటైలర్‌ల ద్వారా కొనసాగుతున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలకు ప్రోత్సాహాన్ని అందించింది.


పండుగ విక్రయాల మొదటి వారం సాధారణంగా ప్రతి సంవత్సరం ఎక్కువ సేల్స్ జరుగుతాయి. Apple iPhoneలు, Samsung ఫ్లాగ్‌షిప్ Galaxy S సిరీస్ వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై డీల్‌లు, డిస్కౌంట్‌లను క్యాష్ చేసుకోవాలని వినియోగదారులు ఎక్కువగా ప్రయత్నించారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?