BSNL Recharge Plans: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారుల కోసం 336 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ. 1499. ఈ రీచార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ (unlimited Voice calls), 24GB డేటాతో పాటు రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. ఈ బీఎస్ఎన్ఎల్ ప్యాక్ ముఖ్యంగా ఎక్కువ ఇంటర్నెట్ ఉపయోగించని వారికి, ముఖ్యంగా కాలింగ్, మెస్సేజ్‌లు చేసే వారి కోసం తీసుకొచ్చింది. అందుకే ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా ఇంటర్నెట్ డేటా చాలా తక్కువగా వస్తుంది.

Continues below advertisement


రోజుకు రూ. 5 కంటే తక్కువకే


ఈ BSNL ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ. 1499 ధరను 336 రోజులుగా విభజిస్తే, రోజుకు రూ. 5 కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, SMSలను మీకు అందిస్తుంది. ఇందులో రోజువారీ డేటా పరిమితి లేదు, కానీ 24GB ఇంటర్నెట్ డేటా మాత్రమే వస్తుంది. ఎక్కువ ఇంటర్నెట్ ఉపయోగించని కాల్స్ కోసం చూసే వారికి తక్కువ ధరకే వస్తున్న ప్లాన్ ఇది. ఎప్పుడైనా ఎక్కువ ఇంటర్నెట్ డేటా కావాలంటే అడిషనల్ ప్యాక్ రీఛార్జ్ చేసుకోవాలి.


రీచార్జ్ ప్లాన్ ద్వారా ఏం లభిస్తాయి



  • అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (లోకల్, నేషనల్)

  • ఉచిత జాతీయ రోమింగ్ సదుపాయం

  • రోజుకు 100 ఉచిత SMSలు

  • మొత్తం 24GB డేటా (పూర్తి వ్యాలిడిటీ టైంకు)

  • 336 రోజుల వ్యాలిడిటీ


BSNL నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ ప్రయత్నాలు


ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఇటీవల టెలికాం సంస్థ 1 లక్షల కొత్త 4G/ 5G టవర్లను ఏర్పాటు చేసి నెట్ వర్క్ మెరుగుచేసింది. త్వరలో మరిన్ని టవర్లను ఏర్పాటు చేయాలని తద్వారా నెట్ వర్క్ సమస్య లేకుండా, బెటర్ సర్వీస్ ఇవ్వాలని యోచిస్తోంది. దాంతో కాల్ డ్రాప్‌లు తగ్గుతాయి. ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. మంచి నెట్‌వర్క్ కవరేజ్ వంటి వాటికి  పరిష్కారం లభిస్తుంది. 


ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్


ప్రస్తుతం రిలయన్స్ Jio, Airtel, Vi వంటి కంపెనీలు తక్కువ వ్యాలిడిటీ ప్లాన్‌లను ఎక్కువ ధరలకు అందిస్తుండగా ప్రభుత్వ సంస్థ BSNL ఈ రూ. 1499తో దీర్ఘకాలిక వ్యాలిడిటీ ఆఫర్‌లో మార్కెట్‌లో గేమ్ ఛేంజర్ గా మారనుంది. ఇది ఇతర టెలికాం సంస్థలకు పెద్ద సవాలుగా మారవచ్చు. చౌకైన ధరతో పాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్ కోసం చూసేవారు పోర్ట్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కు మారే అవకాశాలు పెరుగుతాయి. 


రూ. 1958తో Jio ప్లాన్


ఒకసారి రీఛార్జ్ చేసి ఒక ఏడాది పాటు వ్యాలిడిటీ కావాలనుకుంటే రూ.1958కి జియో ప్లాన్ తెచ్చింది. ఇందులో 365 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 3600 ఉచిత SMSలు, అదనంగా Jio యాప్‌లకు యాక్సెస్ ఇస్తుంది. ఈ కొత్త ప్లాన్‌తో పాటు, Jio తన 2 పాత రీచార్జ్ ప్లాన్‌లను నిలిపివేసింది. 6GB డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 479 ప్లాన్ తెచ్చింది. 24GB డేటా, 336 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ. 1899 ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో లేదు.