Whatsapp Tips: నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. వాట్సాప్ తన వినియోగదారులను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో వ్యక్తిగత గోప్యత వంటి లక్షణాలతో మీ డేటా లీక్ కాకుండా చూస్తుందని మెటా సంస్థ చెబుతోంది. కానీ వాస్తవానికి జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉండవచ్చు. మీరు రాత్రిపూట మీ స్నేహితుడితో చాట్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కొన్ని మెస్సేజ్‌లు చదవకుండానే మీరు "Read" చేసినట్లుగాగా కనిపించినట్లు ఎప్పుడైనా గుర్తించారా.  లేదా మూడవ వ్యక్తి కూడా కాల్ సమయంలో వాయిస్ వింటున్నట్లుగా శబ్దాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ విషయాలు చదువుతుంటే కొందరు వాట్సాప్ వినియోగదారులకు ఇది కొత్తగా అనిపిస్తుంటే.. మరికొందరికీ ఇది తమకు జరిగింది అని అనిపిస్తుంది. 

వాట్సాప్ సురక్షితమేనా? (Is WhatsApp safe?)వాట్సాప్‌నకు నున్న బలమైన భద్రతా వ్యవస్థ దానిని సాధారణ హ్యాకింగ్ నుండి రక్షిస్తుంది. కానీ ఇది 100 శాతం మీకు డేటా ప్రైవసీ ఇస్తుందని మాత్రం కాదు.  ఎవరైనా మీ ఫోన్‌ యాక్సెస్ పొందితే లేదా మీ వాట్సాప్ QR కోడ్‌ను స్కాన్ చేసినా సమయంలో లేదా స్పైవేర్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే కనుక మీ వాట్సాప్ చాట్‌ మెస్సేజ్‌లతో పాటు మీ వాట్సాప్ కాల్‌ల వివరాలు ప్రమాదంలో పడవచ్చు.

మనం ఫేక్ లింక్‌లపై క్లిక్ చేసినప్పుడు లేదా మన మొబైల్ సేఫ్టీని ఈజీగా తీసుకున్నప్పుడు తరచుగా ఇలాంటి గూఢచర్య కేసులు (Data Privacy Cases) జరుగుతాయి. కనుక మీ ఫోన్, యాప్ గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. 

ఎవరైనా మీ వాట్సాప్‌పై గూఢచర్యం చేస్తున్నారో లేదో తెలుసుకోండిమీరు మెస్సేజ్‌లను ఓపెన్ చేయకపోయినా ఆ మెస్సేజ్ చదివినట్లుగా కనిపిస్తే, మీ వాట్సాప్ అకౌంట్‌లోకి  మరొకరు లాగిన్ అయ్యారని సిగ్నల్ కావచ్చు. ఫోన్ అకస్మాత్తుగా వేడెక్కినా లేదా బ్యాటరీ వేగంగా అయిపోతే అది దాగి ఉన్న స్పైవేర్ వల్ల కావచ్చు. ఏదైనా తెలియని డివైజ్‌లో WhatsApp వెబ్‌లోకి లాగిన్ అయి ఉంటే, వెంటనే లాగౌట్ కావాలి. తెలియని నంబర్‌ల నుండి వింత లింక్‌లు లేదా మెస్సేజ్‌లు రిసీవ్ చేసుకోవడం, లేదా కాల్‌లలో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ లాంటివి వస్తే మీపై నిఘా పెట్టారని, మీ డేటాను చోరీ చేస్తున్నారని తెలిపే సంకేతాలు కావచ్చు.

WhatsApp స్పై చేయకుండా 5 సులభమైన  మార్గాలు

రెండు-దశల వెరిఫికేషన్ ఆన్ చేయండిమీరు WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లి ఖాతా > రెండు-దశల ధృవీకరణ (2 Step verification)కు వెళ్లి దానిని ఆన్ చేయండి. ఇది మీ వాట్సాప్ ఖాతాను ఇతరులు సులభంగా యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది.

లింక్ అయిన డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ చేయండివాట్సాప్ లో సెట్టింగ్‌లు > లింక్ చేయబడిన (Link Devices) పరికరాలకు వెళ్లి మీకు తెలియని డివైజ్ కనిపిస్తే వెంటనే లాగౌట్ చేయాలి. 

మరీ అనుమానం ఉంటే మొబైల్ నంబర్‌ను మార్చండిమీ సిమ్ లేదా మొబైల్ ట్యాంపర్ అయిందని మీరు భావిస్తే కనుక మొదట సిమ్ కార్డును మార్చేసి కొత్తన నెంబర్ తీసుకోవడం మంచిది.

లొకేషన్ షేరింగ్‌ను ఆఫ్ చేయాలిమీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా మీ కదలికలను  ట్రాక్ చేస్తున్నారని అనుమానం కలిగితే కనుక  Settings > Privacy > స్థానానికి వెళ్లి లొకేషన్ షేరింగ్‌ను ఆఫ్ చేయడం బెటర్

మీ ఫోన్‌ను, యాప్‌లను అప్‌డేట్‌గా ఉంచండిWhatsApp యాప్‌తో పాటు మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌గా ఉంచడం ద్వారా కొన్ని రకాల భద్రతా పరిష్కారం లభిస్తుంది. కనుక వాటిని తాజా వెర్షన్‌లో ఉంచాలి

యాంటీ స్పైవేర్ యాప్‌లను వాడాలిNorton, Bitdefender లేదా Malwarebytes వంటి యాంటీ స్పైవేర్ యాప్‌లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే స్పైవేర్‌ను గుర్తించి వాటిని తొలగిస్తాయి.