WhatsApp Update Feature: వాట్సాప్ ఇప్పుడు నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయిది. మొబైల్ లేకుండా అందులో వాట్సాప్ లేకుండా ఉండలేని పరిస్థితిని మనం చూస్తున్నాం..  అలాంటి ముఖ్యమైన వాట్సాప్‌ను మరింతగా ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని ఫీచర్సను అందుబాటులోకి తీసుకొస్తోంది. 

ఇప్పుడు మీరు ఒకే WhatsApp ఖాతాను రెండు వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఇంతకు ముందు ఇలాంటి ఆప్షన్ ఉండేది కాదు.  ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లలో మాత్రమే వాడుకునే వీలు ఉండేది. WhatsApp ఒకే ఫోన్‌లో మాత్రమే పని చేయడానికి అనుమతించింది. కానీ ఇప్పుడు కంపెనీ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, దీనితో రెండు ఫోన్‌లలో వాడుకునే పని చాలా సులభం అవుతుంది.

ఇప్పుడు WhatsApp Multi-Device ఫీచర్ ఒకే ఖాతాను ఒకేసారి నాలుగు పరికరాల్లో ఉపయోగించడానికి మీకు అనుమతి లభిస్తుంది. ఇందులో రెండవ స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. అంటే, ఇప్పుడు మీరు ఒకే ఫోన్‌కు పరిమితం కావాల్సిన అవసరం లేదు.

ఒక WhatsApp ఖాతాను రెండు ఫోన్‌లలో ఎలా ఉపయోగించాలి?ఈ ట్రిక్ ఉపయోగించడానికి, మీకు మూడో పార్టీ యాప్ అవసరం లేదు. కొన్నిఈజీస్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా ఒకే వాట్సాప్ రెండు ఫోన్‌లలో వాడుకోవచ్చు. 

  1. రెండో ఫోన్‌లో WhatsAppని ఇన్‌స్టాల్ చేయండి - ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీ నంబర్‌ను రిజిస్టర్ చేయకండి.
  2. Link to Existing Account ఎంచుకోండి - యాప్ వెల్కమ్ స్క్రీన్‌లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది.  దానిపై నొక్కండి.
  3. QR కోడ్‌ను స్కాన్ చేయండి - ఇప్పుడు ఆ ఫోన్ స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది.
  4. మీ ప్రధాన ఫోన్ నుంచి స్కాన్ చేయండి - ఇప్పటికే WhatsApp వాడుతున్న ఫోన్‌లో ఇలా చేయండి

Settingsకి వెళ్లండి

  • Linked Devices ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  • ఇప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయండి
  • అంతే! ఇది చేసిన తర్వాత, మీ WhatsApp రెండు ఫోన్‌లలో యాక్టివేట్ అవుతుంది.  మీ అన్ని చాట్‌లు, సందేశాలు, మీడియా రెండు ఫోన్‌లలో కనిపిస్తాయి. 
  • QR కోడ్ ఆప్షన్ కనిపించకపోతే?

మీరు WhatsApp Web ఆప్షన్‌ను కూడా ప్రయత్నించవచ్చు. దీని ద్వారా, మీరు బ్రౌజర్ ద్వారా రెండో ఫోన్‌లో WhatsAppని కూడా ఉపయోగించవచ్చు.

డేటా సురక్షితంగా ఉంటుందా?డేటాకు ఢోకా లేదని మెటా చెబుతోంది. కచ్చితంగా! WhatsApp ఈ Multi-Device ఫీచర్ End-to-End Encryptionతో వస్తుందని బల్లగుద్ది చెబుతోంది. మీ వ్యక్తిగత చాట్‌లు, కాల్‌లు పూర్తిగా సురక్షితంగా ఉంటాయని మాట ఇస్తోంది. మీరు ఒక డివైస్లో ఉన్నా లేదా నాలుగు పరికరాల్లో ఉన్నా, మీ గోప్యతకు ఎలాంటి ఇబ్బంది లేదని మెటా పేర్కొంది. 

ఎంత పని చేశావు మెటా అంటున్న రొమాంటిక్ భర్తలుఈ ఫీచర్‌పై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. భర్తల వాట్సాప్‌ ఛాట్‌లను భార్యలకు యాక్సెస్ ఇస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రైవసీ లేదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాపురాలు కూల్చే అప్‌డేట్‌లా ఉందని జోక్‌లు పేలుస్తున్నారు. రొమాంటిక్ భర్తలను కంట్రోల్ చేయడానికి ఇది భార్యలకు దొరికిన ఆయుధమంటు మరికొందరు అంటున్నారు.