Google Alert: మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో Gmail లేదా సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటే ఇది మీ కోసమే. ఇలాంటి వారంతా జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఒక పెద్ద సైబర్ దాడి జరిగి ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల కంటే ఎక్కువ పాస్‌వర్డ్‌లు, ఇమెయిల్ IDలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది Google, Facebook, Apple Telegram వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లపై డైరెక్ట్‌ ఎఫెక్ట్ పడేలా జరిగిన అతి పెద్ద దాడిగా చెబుతున్నారు.  

అసురక్షిత సర్వర్ నుంచి డేటా లీక్ సున్నితమైన సమాచారం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓపెన్‌గా యాక్సెస్ చేసే సర్వర్‌ను గుర్తించారు. ఇది సాధారణ వినియోగదారులనే కాకుండా, ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, వ్యాపార ఇమెయిల్‌లు, VPNలు, సోషల్ మీడియా అకౌంట్‌లపై కూడా ప్రభావం చూపింది. అందులో డేటా ప్రమాదంలో పడింది. ఈ ఖాతాల్లోని డేటా ప్రమాదంలో పడిందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

పాత, కొత్త పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయివివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ దఫా సైబర్‌ దాడిలో పాత పాస్‌వర్డ్‌లు మాత్రమే కాకుండా, ఇటీవల మార్చిన పాస్‌వర్డ్‌లు కూడా లీక్ అయ్యాయి. పరిశోధకులు 30 కంటే ఎక్కువ లీక్ అయిన డేటాబేస్‌లను విశ్లేషించారు, ఇందులో మొత్తం 350 కోట్ల కంటే ఎక్కువ రికార్డ్‌లు ఉన్నాయి. ఈ డేటా లీక్ 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్ని అంశాలు అందులో ఉన్నాయి. అంటే ఇటీవల అప్‌డేట్ చేసిన ఖాతాలు కూడా ప్రమాదంలో పడినట్టు అర్థమవుతోంది. 

Google ఏం చెప్పిందంటే 

ఈ తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, Google వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది.  

ముందుగా, మీ ఇమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా వంటి ముఖ్యమైన ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోండి.

క్యాపిటల్‌ లెటర్స్‌, డిజిట్స్, ప్రత్యేక సింబల్స్‌ ఉన్న స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.

అదనపు భద్రత కోసం రెండు ఫ్యాక్టర్‌ అథెంటికేషన్(2FA)ని ఆన్ చేసి పెట్టుకోవాలని చెప్పింది.

ఫిషింగ్ ,పాస్‌వర్డ్ దొంగతనం నుంచి రక్షించడానికి "పాస్‌కీ" వంటి ఫీచర్లను ఉపయోగించండి.

ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయడం మానుకోండి.

ఏదైనా తెలియని ఇమెయిల్ లేదా సందేశంలో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు.

ఇలా చేయడం వల్ల మీకు చెందిన ఒక మెయిల్‌ ఖాతా మాత్రమే కాదు, మొత్తం డిజిటల్ లైఫ్‌ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది.  

ఈ డేటా లీక్ Google, Apple, Facebook, Telegram  అనేక కార్పొరేట్ నెట్‌వర్క్‌ల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. చాలా మంది ఒకే పాస్‌వర్డ్‌ను అనేక చోట్ల వాడుతుంటారు. అంటే ఒక పాస్‌వర్డ్ లీక్ అయితే, అనేక ఖాతాలు ఒకేసారి హ్యాక్ చేయవచ్చు.

ఇప్పుడే ఈ చర్యలు చేపట్టండి మీరు చాలా కాలంగా పాస్‌వర్డ్‌ మార్చుకోకపోతే, ఇక ఆలస్యం చేయకండి. నమ్మదగిన పాస్‌వర్డ్ మేనేజర్ సహాయం తీసుకోండి, మీ అన్ని ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి, సైబర్ మోసాలకు సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా ఉండండి. మీ డిజిటల్ భద్రత మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వెంటనే చర్య తీసుకోండి.