యాపిల్ తరహాలో ప్రతియేటా పరిమిత స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే కంపెనీ అసుస్ మాత్రమే. చిన్న సైజు ఉన్న పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్ లాంచ్ చేస్తూ మిగతా బ్రాండ్ల కంటే భిన్నమైన దారిలో వెళ్లడం అసుస్ ప్రత్యేకత. ఇప్పుడు అసుస్ జెన్‌ఫోన్ 9ను కంపెనీ త్వరలో లాంచ్ చేయనుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది.
ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో చూడవచ్చు. మొదట ఈ వీడియోను టెక్ గోయింగ్ గుర్తించింది. గతేడాది వచ్చిన జెన్‌ఫోన్ 8 కంటే విభిన్నమైన డిజైన్‌లో జెన్‌ఫోన్ 9 రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెడ్, వైట్, బ్లూ, బ్లాక్ రంగుల్లోఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ వీడియో ప్రకారం... ఇందులో 5.9 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీంతోపాటు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉండనుంది.
వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉండనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఫోన్ వెనకవైపు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!