Asus Zenfone 11 Ultra Launched: అసుస్ జెన్‌ఫోన్ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్‌గా ఉంది. కొన్ని ఇన్‌బిల్ట్ ఏఐ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని వెనకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది.
అసుస్ జెన్‌ఫోన్ 11 అల్ట్రా ధర (Asus Zenfone 11 Ultra Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 999 యూరోలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.90,000) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1099 యూరోలుగా (సుమారు రూ.99,000) నిర్ణయించారు. ఎటర్నల్ బ్లాక్, మిస్టీ గ్రే, స్కైలైన్ బ్లూ, డిజర్ట్ శాండ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అసుస్ జెన్‌ఫోన్ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు (Asus Zenfone 11 Ultra Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై అసుస్ జెన్‌ఫోన్ 11 అల్ట్రా పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 94 శాతంగా ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 2500 నిట్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. రియల్ టైమ్ ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్, ఏఐ ఆధారిత సెర్చ్ టూల్, లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. జూమింగ్‌ను మెరుగుపరచడానికి ఇందులో వేర్వేరు ఏఐ అల్గారిథమ్స్‌ను అసుస్ అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, వైఫై డైరెక్ట్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో ఉన్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 65W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 39 నిమిషాల్లోనే అసుస్ జెన్‌ఫోన్ 11 అల్ట్రా పూర్తిగా ఛార్జింగ్ ఎక్కనుంది. ఇది 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?