Apple to introduce iPhone Air | ఐఫోన్‌ ఈ పేరుకు ఉన్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది దాని ప్రీమియం లుక్‌, డిజైన్‌,  డ్యూరబిలిటీ. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఈ ఐఫోన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే టెక్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త గ్యాడ్జెట్స్​ను మార్కెట్​లోకి అందుబాటులోకి తెస్తున్నాయి ఆయా స్మార్ట్ ఫోన్​ కంపెనీలు. అలానే యాపిల్​ కంపెనీ కూడా తమ యూజర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించేందుకు సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తోంది. కానీ గత నాలుగేళ్లుగా ఈ కంపెనీ విడుదల చేస్తున్న మోడళ్లు యూజర్లను అంతగా ఆకట్టకోవట్లేదు. మినీ, ప్లస్​ వెర్షన్​లకు కాస్త నెగటివ్​ ఫీడ్​బ్యాక్​లు వస్తున్నాయి. 


ప్లస్​ మోడల్​కు రీప్లేస్​మెంట్​గా - అయితే ఇప్పుడు ఐఫోన్​ నుంచి మరికొన్ని కొత్త మోడల్ ఫోన్లు రానున్నాయి. ఇందులో భాగంగానే ఐఫోన్​ 14 ప్లస్​ను పరిచయం చేసింది యాపిల్ కంపెనీ. అది ఈ ఏడాది సెప్టెంబరులో రానుంది. అలాగే దాని లైనప్​లో ఐఫోన్ 16 ప్లస్​తో పాటు ఐఫోన్​ 17 సిరీస్​ రానుంది. ఐఫోన్ ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్​ వంటివి రానున్నాయి. 


అయితే ఇప్పుడు బ్లూమ్‌బర్గ్‌ మార్క్‌ గుర్మన్‌ నివేదిక ప్రకారం  మరో కొత్త మోడల్​ను కూడా తీసుకురాబోతున్నట్లు తెలిసింది. ప్లస్​ మోడల్​ను​ రీప్లేస్ చేయనుందట. ప్లస్ మోడల్​కు యూజర్ల నుంచి కాస్త నెగటివ్​ రివ్యూస్​ రావడంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ​ప్లస్​ మోడల్​ ప్లేస్​లో ఐఫోన్​ 17 ఎయిర్ మోడల్​ను తీసుకు రానుంది.. ఐఫోన్​ 17 - ఐఫోన్ 17 ప్రో మధ్య ఈ ఎయిర్​ మోడల్ స్పెసిఫికేషన్స్​ ఉండనుందని సమాచారం. ఇక యాపిల్​లోని ప్లస్ వెర్షన్​ మోడల్స్​లో ఐఫోన్ 16 ప్లస్​ లాస్ట్​ మోడల్​ అని తెలిసింది. 


ఎప్పుడు విడుదల అంటే? - 2025లో ఈ ఎయిర్ మోడల్​ విడుదల చేయనున్నారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. మినీ, ప్లస్ వెర్షన్​ల కన్నా బెటర్​గా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఫీచర్ల విషయానికొస్తే 6.65- ఇంచ్​​ LTPO డిస్​ ప్లే, ప్రోమోషన్ టెక్నాలజీ, 120Hz రిఫ్రెష్ రేట్​తో రానుందట.  ముఖ్యంగా ఈ ప్రోమోషన్​ ప్రత్యేకంగా ఉండనుందని కెవిలింగి. ఇక ప్రో మోడల్స్​ ఉండే ఫీచర్లే ఈ ఎయిర్​ మోడల్​లోనూ ఉండనున్నాయి.   


మరో కొత్త మోడల్ కూడా(iPhone SE) - ఇంకా ఈ ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్‌ SE సిరీస్‌ కూడా విడుదల కానుంది. ఇది కూడా 2025లోనే రానుందట. ఇతర ఐఫోన్‌ల కన్నా తక్కువ ధరకే అందుబాటులోకి రానుందని తెలిసింది. గత మోడళ్ల కన్నా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందట. OLED డిస్‌ప్లే, ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.