Google Pixel 9 series launching on August 13 Price, leaked specs, design, colours: మొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న గూగుల్ 9 సిరీస్ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఆగస్టు 13న నిర్వహించనున్న ఈవెంట్ లో ఈ ఫోన్లను గ్రాండ్ గా లాంచ్ చేయనుంది గూగుల్. Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL and Pixel 9 Pro Fold మోడల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. ఏటా ఐఫోన్ సెప్టెంబర్ లో నిర్వహించే లాంచింగ్ ఈవెంట్ కంటే గూగుల్ ఈసారి ముందుగానే ఈవెంట్ ని నిర్వహించి తన కొత్త సిరీస్ ని లాంచ్ చేయనుంది. అయితే, ఈ ఫోన్లకి సంబంధించి ఫీచర్స్, ధర రిలీజ్ కి ముందే లీక్ అయ్యాయి. మరి ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? ఒకసారి చూద్దాం.
పిక్సెల్ 9 (Pixel 9) ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి...
పిక్సెల్ 9 ఫోన్ 6.3 ఇంచుల డిస్ ప్లే, బ్లాక్, లైట్ గ్రే, పార్సిలియన్, పింక్ రంగుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. గ్లాసి ఎక్స్ టీరియర్, మంచి కెమెరా సెటప్ తో ఈ ఫోన్ రానుంది. దాంతో పాటుగా.. కొత్త టెన్సార్ G4 చిప్ సెట్, 12 జీబీ ర్యామ్ తో రానుంది. పిక్సెల్ 9 ధర దాదాపు $599 నుంచి $799 మధ్య ఉండే అవకాశం ఉంది. అంటే సుమారు మన కరెన్సీలో రూ.55 నుంచి 67 వేల మధ్య ఉంది.
పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ (Pixel 9 Pro and Pixel 9 Pro XL):
పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ మోడల్స్ టెన్సార్ జీ4 SoC, 16 జీబీ ర్యామ్ తో వస్తుంది. ప్రో మోడల్ 4,558mAh బ్యాటరీ, Pixel 9 Pro XL 4,942mAh బ్యాటరీతో రానుంది. Pixel 9 Pro ధర 128GB వేరియంట్ దాదాపు రూ. 1,17,755, 256GB వేరియంట్ దాదాపు రూ.1,28,456, 512GB వేరియంట్ దాదాపు రూ.1,42,384 లక్షలు ఉండే అవకాశం ఉంది.
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్.. (Pixel 9 Pro Fold):
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ దాదాపు 6.4 ఇంచుల డిస్ ప్లే, 8 ఇంచుల ఇన్నర్ డిప్ ప్లేతో రానుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో రానుంది. 48 ఎంపీ ప్రైమరీ, 10.5 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 10.8 ఎంపీ టెలీ ఫొటో షూటర్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా 10 ఎంపీ షూటర్ కెమెరా రానుంది. 256GB వేరియంట్ ఫోన్ రూ.1,74,069, 512GB వేరియంట్ రూ.1,85,96 ధర ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు 13న లాంచింగ్ ఈవెంట్ ఉండగా.. అప్పటి నుంచే అందుబాటులోకి రానున్నాయి ఈ ఫోన్లు. అయితే, ఇండియాలో మాత్రం ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, కేవలం ఆన్ లైన్ లోనే ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో సేల్ స్టార్ట్ కానుంది.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’లో ముందుగా ఆ పాత్రలో కీర్తి సురేశ్ - నో చెప్పి మంచి పని చేశానంటూ కామెంట్స్