Apple iPhone 14 సిరీస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ(సెప్టెంబర్ 7న) రాత్రి 10.30 గంటలకు ఆపిల్ లాంచ్ ఈవెంట్ 2022 అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో Apple iPhone 14 సిరీస్ కు సంబంధించి ఫోన్లను కంపెనీ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నది. ఓ వైపు ఈ ఈవెంట్ కోసం స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఈవెంట్ కంటే ముందే Apple iPhone 14కు సంబంధించి ఓ వీడియో లీక్ అయ్యింది. ఇందులో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి చాలా వివరాలు వెల్లడయ్యాయి.
ఆకట్టుకుంటున్న డిజైన్
ఆపిల్ ఐఫోన్ 14కు సంబంధించిన డిజైన్, పరిమాణం కొత్తగా విడుదలైన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఫ్రంట్ కెమెరా, ఫేస్ ID ఫీచర్ కోసం రీడిజైన్ చేయబడిన డ్యుయల్ కట్ - అవుట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. రెండు కటౌట్‌ల మధ్య ప్రాంతంలోని పిక్సెల్‌లను బ్లాక్ అవుట్ చేయడానికి ఒక మార్గం ఉన్నట్లు కనిపిస్తోంది. GSM Arena తాజాగా విడుదల చేసిన వీడియోలో పలు విషయాలు వెల్లడి అయ్యాయి. ఆపిల్ చాలా స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నది. ఐఫోన్ 14 ప్రో మోడల్ ఒకే వెడల్పైన పిల్ ఆకారపు కటౌట్‌ని కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. iOS 14తో రివీల్ అయిన ఈ ఫోన్ లో సరికొత్త ప్రైవసీ ఇండికేషన్స్ పరిచయం చేశారు. ఐఫోన్ 14 కోసం స్టేటస్ బార్‌ను ఆపిల్ పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. ఐఫోన్ డిస్ ప్లే కుడి వైపున పూర్తి బ్యాటరీ సమాచారాన్ని చూపుతుంది. ఎడమ వైపున, క్యారియర్, నెట్‌వర్క్ సిగ్నల్ గురించిన వివరాలు చూపబడతాయి.
8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు చేసే కెమెరా!
తాజా వీడియో గమనిస్తే.. Apple iPhone 14 వెనుక కెమెరా లెన్స్‌లు Apple iPhone 13 Proలో కనిపించే వాటి కంటే పెద్దగా ఉన్నాయి. Apple iPhone 14 విషయంలో వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాల లెన్స్‌లు పెద్దగా ఉన్నాయి. పెద్ద కెమెరా లెన్స్‌ల కారణంగా ఐఫోన్ 14 లో ఫ్లాష్, లిడార్ స్కానర్ కూడా కొద్దిగా మార్చారు. ఐఫోన్ 14 సిరీస్‌లో కెమెరా బంప్ ఉంటుందని వెల్లడించాయి. Apple iPhone 14 మోడల్‌లు తక్కువ లైటింగ్ లోనూ మంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఇందుకోసం 48 మెగా ఫిక్సెల్ వైడ్ కెమెరాను అందిస్తోంది కంపెనీ. ఈ స్మార్ట్ ఫోన్ లు 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 14 సిరీస్ లో 4 కొత్త మోడళ్లు విడుదల
గత రెండు ఈవెంట్ల మాదిరిగానే ఈ ఏడాది సైతం నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లను విడుదల చేస్తుంది. Apple iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max. iPhone 14 సిరీస్ కాకుండా.. టెక్ దిగ్గజం Apple Watch Series 8, Apple Air Pods Pro 2లను లాంచ్ చేసే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆపిల్ లాంచ్ ఈవెంట్ 2022 రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.