Apple iPhone 16 series Updates Rate And Features: యాపిల్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ.. కొత్త కొత్త ఐఫోన్ సిరీస్ ల‌ను రిలీజ్ చేస్తుంది. దాంట్లో భాగంగానే త్వరలో ఐఫోన్ 16 సిరీస్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో దీన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడ ఐఫోన్ డ‌మ్మీ ఇమేజ్ లు కొన్ని ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న ఐఫోన్-16‌లో ఎలాంటి ఫీచ‌ర్స్ ఉంటాయో అని  ఐఫోన్ ల‌వ‌ర్స్ లో ఆస‌క్తి నెల‌కొంది. 


రీ డిజైన్ తో.. 


ఆన్ లైన్ లో స‌ర్క్యూలేట్ అవుతున్న డ‌మ్మీ ఇమేజ్ ల‌ను బ‌ట్టి చూస్తే.. ఐఫోన్ 16లో కొన్ని మార్పులు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 16, 16 ప్ల‌స్ లో రీ డిజైన్డ్ కెమెరా ఐలాండ్, ఐ ఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లో 6.3 ఇంచులు, 6.9 ఇంచుల డిస్ ప్లే ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప్రో మోడ‌ల్స్ డిస్ ప్లే ప‌రిమాణాన్ని పెంచాల‌ని చాలా సూచ‌న‌లు వ‌చ్చిన‌ట్లు గ‌తంలో వార్తలు వ‌చ్చాయి. కాగా.. ఇప్పుడు 16 , 16 ప్లస్ ఒకే సైజ్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్రో మ్యాక్స్ లో మాత్రం గ‌తంలో ఐఫోన్ కి ఎన్న‌డూ లేనంత పెద్ద‌గా స్క్రీన్ ఉండ‌బోతోంది అని అంచ‌నా వేస్తున్నారు టెక్నాల‌జీ నిపుణులు. మినిమ‌ల్ బెజెల్స్ తో, ఎక్కువ స్క్రీన్-టు-బాడీ రేషియో క‌లిగి ఉంటుంద‌ని అంచ‌నా. 


3డీ వీడియో రికార్డింగ్ తో.. 


ఐఫోన్ 16, 16 ప్ల‌స్ లో స్క్రీన్ సైజ్ లో పెద్ద‌గా మార్పు ఉండ‌క పోవ‌చ్చు.  6.1, 6.7 ఇంచ్ ల‌తో వ‌చ్చే అవ‌కాశం ఉంది. రెండు మోడ‌ల్స్ లో కెమెరా ఐలాండ్ లో అప్ డేట్ రానుంది. కొత్త స్టైల్ లో, ఐ ఫోన్ 10 లాగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ కొత్త మోడ‌ల్ లో 3డీ లేదా స్పాటియ‌ల్ వీడియో రికార్డింగ్ కేప‌బులిటీ ఉంది. ఇక ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్ విష‌యానికొస్తే నాలుగు మోడ‌ల్స్ ముందు జన‌రేష‌న్ కి ద‌గ్గ‌రిగా ఉంటుంద‌ని తెలుస్తోంది. గ్లాస్ మెట‌ల్, సాండ్ విచ్ డిజైన్ తో ఉంటుంద‌ని చార్జింగ్, డేటా ట్రాన్స్ ఫ‌ర్ కి మాత్రం యూఎస్ బి - సీ పోర్ట్స్ ఇవ్వ‌నున్నారు. 


ట్రిపుల్ కెమెరా, పెద్ద స్క్రీన్.. 


ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ రెండూ మోడ‌ల్స్ ఒకేలా ఉండే అవ‌కాశం ఉంది. ట్రిపుల్ కెమెరాతో వ‌స్తుంది. ఇక స్క్రీన్, బ్యాట‌రీ మాత్రం పెద్ద‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. 16 ప్రో, ప్రో మ్యాక్స్ లో టైటానియ‌మ్ లాంటి మెటీరియ‌ల్ ఇన్ కార్పొరేట్ చేయనున్నారు. అల్యూమినియంతో త‌యారు చేస్తార‌ట‌. ఐఫోన్ 16కి యాక్సిన్ బ‌ట‌న్ వ‌స్తుంద‌నే వార్త కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఐఫోన్ 16 మోడ‌ల్ ఫోన్లు అన్నింటికి డైనామిక్ ఐలాండ్ ఉంటుంది. ఇక 16ప్ల‌స్ మోడ‌ల్స్ రేటు అలానే ఉంటుంద‌ని, ప్రో సిరీస్ రేటు మాత్రం భారీగా పెరిగే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 


Also Read: వాట్సాప్‌లో ఈ మార్పులు గమనించారా, కొత్త అప్‌డేట్స్ ఇవే