Apple iPhone 15 Series Price: యాపిల్ కొన్ని నెలల క్రితం ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 గురించి కూడా ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించి అనేక లీక్స్ స్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌లో అనేక రకాల అప్‌గ్రేడ్‌లు కనిపించనున్నాయియి. తాజా లీక్‌ల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్ ధర ప్రస్తుత ఐఫోన్ 14 సిరీస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా Samsung Galaxy Z Fold 5 కోసం కూడా ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లాంచ్‌కు ముందే దీని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి.
ఐఫోన్ 15 సిరీస్ ధర
తాజా లీక్ ప్రకారం ఐఫోన్ 15 ప్రారంభ ధర 1299 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రస్తుత ఐఫోన్ 14 కంటే 200 డాలర్లు ఎక్కువ. అంటే ఐఫోన్ 15 సిరీస్ ధర ప్రస్తుత ఐఫోన్ 14 సిరీస్ కంటే ఎక్కువగా ఉండనుందన్న మాట.
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫీచర్లు
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5కి సంబంధించి అనేక లీక్స్ వచ్చాయి. దీని మునుపటి వెర్షన్ అందరికీ బాగా నచ్చింది. అటువంటి పరిస్థితిలో రాబోయే మోడల్ గురించి కూడా చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్‌ను జూన్ 2023లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
కంపెనీ దాని లాంచ్ తేదీని ధృవీకరించలేదు. లీక్‌ల ప్రకారం Samsung Galaxy Z Fold 5 స్మార్ట్‌ఫోన్‌లో S పెన్ స్లాట్ అందించనున్నారు. ఇది కాకుండా ఈ ఫోల్డబుల్ ఫోన్ మునుపటి మోడల్ కంటే సన్నగా, తేలికగా కూడా ఉంటుంది. ఇంప్రూవ్డ్ కెమెరాను ఇందులో ఇవ్వొచ్చు. Samsung Galaxy Z Fold 5 ఫోన్‌లో 200MP కెమెరా ఉండనుందని తెలుస్తోంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?