ఇక డిలీట్ ఫర్‌ మీ కొట్టినా నో ప్రాబ్లం!


ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు మరో చక్కటి ఫీచర్ ను పరిచయం చేసింది. ఇకపై డిలీట్ ఫర్ మీ కొట్టిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 5 సెకన్ల సమయంలో మళ్లీ దాన్ని Undo చేసే అవకాశం కల్పిస్తోంది. కొన్నిసార్లు ఒకరికి పంపాల్సిన మెసేజ్ ను మరొకరికి పొరపాటుగా పంపిస్తే, డెలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తొందరపాటులో డిలీట్ ఫర్ ఎవర్రీవన్ కొట్టడానికి బదులుగా డిలీట్ ఫర్ మీ కొడతారు. అప్పుడు మెసేజ్ పంపిన వ్యక్తి ఫోన్ నుంచి డిలీట్ అయినా.. ఎదుటి వారికి పంపిన మెసేజ్ డిలీట్ కాదు. ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా  పరిష్కారాన్ని కనిపెట్టింది వాట్సాప్. పొరపాటుగా డిలీట్ అయిన మెసేజ్ మళ్లీ రీడూ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ముందుగా డెలీట్ ఫర్ మీ కొట్టిన మెసేజ్‌ను రీడ్ చేసి, ఆ తర్వాత డెలీట్ ఎవ్రీవన్ చేసే అవకాశం ఉంటుంది. డిలీట్ అయిన మెసేజ్ ను Undo ఎలా చేయాలో తెలుసుకోండి మరి. 






కేవలం 5 సెకెన్ల పాటు అందుబాటులో యాక్సిడెంటర్ డిలీట్ బార్


వాట్సాప్ లో డిలీట్ ఫర్ మీ క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ డిలీట్ అవుతుంది. వెంటనే డిటీల్ ఫర్ మీపై క్లిక్ చేయాలి. అక్కడి యాక్సిడెంటర్ డిలీట్ అని చూపిస్తుంది. వెంటనే అక్కడ అన్ డూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీరు డిలీట్ చేసిన మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనం డిలీట్ ఎవ్రీవన్  కొట్టడంతో అందరికీ మెసేజ్ కనిపించకుండా డెలీట్ అవుతుంది. అయితే, ఈ యాక్సిడెంటర్ డిలీట్ బార్ అనేది చాలా తక్కువ సమయం, అంటే 5 సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తోంది. ఆ టైంలోపు అన్ డూ కొడితేనే మెసేజ్ తిరిగి వస్తుంది. లేదంటే మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉండదు.  


టెస్టింగ్ దశలో కెప్ట్‌ మెసేజెస్ ఫీచర్


ఈ ఫీచర్ తో పాటు మరికొన్ని ఫీచర్లను సైతం టెస్టింగ్ చేస్తోంది. కెప్ట్‌ మెసేజెస్ పేరుతో ఓ ఫీచర్ ను అందుబాటులోకి తేబోతోంది. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు తమకు డిస్ అప్పియర్ ఫీచర్ ద్వారా అందుకున్న మెసేజ్ లను డిలీట్ కాకుండా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ ను సైతం త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఎలా పని చేస్తుందనే విషయాన్ని మాత్రం వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు.  ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో తీసుకొచ్చినట్లు మెటా యాజమాన్యం తెలిపింది.   


Read Also: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!