Apple company is offering huge discounts on iPhones Old Models :  యాపిల్ కంపెనీ తమ ఐ ఫోన్  16 మోడల్స్ రిలీజ్ చేసింది. సహజంగానే కొత్త మోడల్స్ విడుదల చేసినప్పుడు పాత మోడల్స్ ధరలను తగ్గిస్తూ ఉంటుంది. మరీ పాత మోడల్స్ ను మార్కెట్ నుంచి ఉపసంహరిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఐ ఫోన్ 16 మార్కెట్లోకి వచ్చింది. ఇది కాకుండా ఐ ఫోన్ 13, 14, 15 మోడల్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఐ ఫోన్ 13 లభ్యత కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 15 మోడల్స్ మాత్రే అమ్మకాలు జరుగుతున్నాయి. 


ఇప్పుు ఈ రెండు మోడల్స్ పై భారీగా తగ్గింపులు ప్రకటించింది. ఒక్కో మోడల్ పై కనీసం పది వేల రూపాయల తగ్గింపుతో అమ్మకాలు జరుగుతాయి. యాపిల్ ఆన్ లైన్ స్టోర్లలో ఐ ఫోన్ 15  128 జీబీ మోడల్ ధరను 69,900 రూపాయలకు తగ్గించారు. గత ఏడాది ఈ ఫోన్ ను ఆవిష్కరించినప్పుడు దీని ధర రూ. 79,900 ఉంది. 256 జీబీ వేరియంట్ ను కూడా పదివేలు తగ్గించి 79,900 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే రెంు మోడల్స్ పై  ఇప్పుడు ఫ్లాట్ పది వేల రూపాయలు తగ్గించారు.ఐ ఫోన్ 14 విషయలోనూ ఇదే తరహా తగ్గింపు ఇచ్చారు. 


అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అయిన iPhone 16 Pro- బిగ్‌ స్క్రీన్, స్పెషల్ కెమెరా ఫీచర్స్‌ ఉన్న ఈ ఫోన్ ధర ఎంతంటే?


ఐ ఫోన్ 14  ఇప్పుడు 59,900 రూపాయలకే వస్తుంది. 128 జీబీ సామర్త్యం ఉన్న ఫోన్ ఇరప్పటి వరకూ 69,900 ఉంది. 256 జీబీ సామర్థ్యం ఉన్న ఐ ఫోన్ 14 రూ. 9,900,  512 జీబీ సామర్థ్యం ఉన్న ఐ ఫోన్ 14 ను 89,900కు తగ్గించారు. నిజానికి గత ఏడాది ఐ ఫోన్ 15ను ఆవిష్కరిస్తున్న సమయంలోనూ ఈ ఫోన్ ధరను పదివేలు తగ్గించారు. అంటే ఏడాదిలోపు ఇరవై వేల రూపాయలు తగ్గిందన్నమాట.                            


యాపిల్ ఐ ఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ ఉత్పత్తుల్ని నిలిపివేస్తూ యాపిల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఐ ఫోన్ 13ను కూడా ఉత్పత్తి చేయరు. అయితే ఐదేళ్ల పాటు యాపిల్ నుంచి సాఫ్ట్ వేర్ సపోర్టు లభిస్తుంది కాబట్టి.. ఈ ఫోన్ వినియోగం కొనసాగుతుంది. ఐ ఫోన్ 16 ప్రారంభధరను యాపిల్ రూ. 79వేలుగా నిర్ణయించింది. ఈ నెల ఇరవై నుంచి బుక్ చేసుకున్న వారికి  డెలివరీలు ఇస్తారు.  



Also Read: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్​ కెమెరా ఫీచర్స్ ఇవే - క్లిక్ చేశారంటే హై క్వాలిటీనే!