iPhone 16 Pro camera Specifications : యాపిల్ ఐఫోన్ అనగానే టక్కున ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట ధరెంత? దాని ఫీచర్ల గురించి తెలుకునే వారికన్నా ఫోన్ ధరెంత అని అడిగేవారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఐఫోన్ అనగానే అందులే ఉండే ఫీచర్లు అన్నీ అత్యుత్తమంగా ఉంటాయనే నమ్మకం యూజర్స్‌లో ఉంటది. మనం గమనిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్ల గురించి తెలిపినంతగా, ఐఫోన్ ఫీచర్ల గురించి యాపిల్ ఎక్కువగా ప్రస్తావించదు. అలానే ఐఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీ, ఇతర ముఖ్యమైన విడి భాగాల గురించి కూడా ప్రైవసీని పాటిస్తుంటుంది.
అయితే ఎక్కువ మంది ఈ ఐఫోన్‌ను సెక్యూరుటీ కోసం కొంటారన్న సంగతి తెలిసిందే. అలానే దీంతో పాటు ముఖ్యంగా చూసేది దాని కెమెరా. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లలో 64 ఎంపీ, 108ఎంపీ కెమెరాలు ఇచ్చినా, ఐఫోన్‌లో మాత్రం 12 ఎంపీ కెమెరాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ, ఫొటోల నాణ్యతలో ఇతర ఫోన్లతో పోల్చి చూస్తే ఐఫోన్‌తో తీసిన ఫొటోలే మెరుగ్గా, స్పష్టతగా కనిపిస్తాయి. అందుకు ప్రధాన కారణం ఐఫోన్ కెమెరాల్లో వినియోగించే సెన్సర్లే.
లాంచ్ డేట్ అప్పుడే - అయితే ఇప్పుడు యాపిల్ యూజర్లంతా ఐఫోన్ 16 సిరీస్ ఎప్పుడెప్పుడు లాంఛ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఓ సూపర్ క్రేజీ అప్డేట్ వచ్చింది. యాపిల్ తన లాంఛ్ ఈవెంట్‌కు సంబంధించి "ఇట్స్ గ్లోటైమ్" అన్న థీమ్‌ను అనౌన్స్ చేసేసింది. ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 9న లాంఛ్ కానుందని తెలిపింది. ఈ ఈవెంట్ యాపిల్ పార్క్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం చూస్తే సెప్టెంబర్ 9, 2024 రాత్రి 10:30 గంటలకు ఈ ఈవెంట్ లైవ్ అవుతుందనమాట. ఈ ఈవెంట్ యూట్యూబ్, యాపిల్ ఈవెంట్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
అయితే ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి రకరకాల రూమర్స్, లీక్స్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐ ఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ కెమెరా ఫీచర్ల, అపగ్రేడ్స్ గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
ఐ ఫోన్ 16 ప్రో కెమెరా స్పెసిఫికేషన్స్(అంచనా) - ఐ ఫోన్ 16 ప్రో రెండు మేజర్ అప్‌గ్రేడ్స్‌తో రానున్నట్లు తెలిసింది. టెక్ రేడర్ రిపోర్ట్ ప్రకారం ఐ ఫోన్ 16 ప్రోలో అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్ ఉందట. 12 మెగా పిక్సల్ నుంచి 48 మెగా పిక్సల్ వరకు అపగ్రేడడ్ అవుతుందట. ఈ అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్ సైజ్ కూడా 1/2.6 ఇంచ్ కూడా పెరుగుతుందట. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ లైట్ అట్రాక్ట్ చేయడంతో పాటు కాప్చర్ చేసిన ఫొటోస్ను ఎంతో క్లారిటీగా చూపిస్తుంది.
మరో అప్‌గ్రేడ్ ఏంటంటే ఈ ఐఫోన్ 16 ప్రోలో కొత్త టెలిఫొటో లెన్స్‌ను అమర్చారని తెలుస్తోంది. 5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో ఇది రానుందట. ఈ కొత్త లెన్స్... ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఉన్న కెమెరానే అని తెలుస్తోంది.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కెమెరా స్పెసిఫికేషన్స్(అంచనా) - ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో కొత్త కెమెరా సెన్సార్‌ను అమర్చారట. 48 మెగా పిక్సల్ రిసొల్యూషన్తో రానుంది. అలానే సెన్సార్ సైజ్‌ను 1/1.14 ఇంచ్‌కు అప్‌గ్రేడ్ చేశారట. ఇమేజెస్‌లో డిస్టోర్షన్ను రెడ్యూస్ చేసేందుకు కొత్త లెన్స్‌ను కూడా అమర్చారని తెలిసింది. ఇంకా ఈ 16 ప్రో మ్యాక్స్‌కు అప్‌గ్రేడెడ్ 48 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉందట. ఇంకా టెట్రాప్రిజమ్ లెన్స్ కలిగిన కొత్త సూపర్ టెలిఫొటో కెమెరా కూడా ఉందని తెలిసింది. దీనికి 5x నుంచి 10x జూమింగ్ కెపబిల్టీ కూడా ఉంది.