AI Jobs in India: ప్రపంచం అంతా ప్రస్తుతం ఏఐ చుట్టూ తిరుగుతోంది. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కూడా ఏఐ గురించి మాట్లాడారు. ఏఐలో భారత్ స్థానం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఏఐకి ప్రపంచంలో ఎంతగానో ఎదగనుంది. భారతదేశంలో కూడా ఏఐ ఎదుగుదలకు ఎంతో ఆస్కారం ఉంది.’ అన్నారు. ముంబైలో జరిగిన సీఈవో కనెక్షన్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.


మైక్రోసాఫ్ట్ రానున్న కాలంలో 20 లక్షల భారతీయులకు ఏఐ మీద శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మంచి వేతనాలు లభించేలా పెద్ద అవకాశాలను సృష్టించనున్నట్లు తెలిపారు. ‘ఏఐ లాంటి దాన్ని నేను ఈ మధ్య చూడలేదు. ఇది ఇక్కడి నుంచి తన స్కేల్‌ను పెంచుకుంటూ పోతూనే ఉంటుంది.’ అన్నారు.


మనల్ని అర్థం చేసుకునే కంప్యూటర్లు సృష్టించడం, డిజిటైజేషన్ వైపు మళ్లించడం ద్వారా ఏఐ వేగవంతం అవుతున్నారు. డిజిటైజేషన్ అనేది జీడీపీపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే రానున్న 250 సంవత్సరాల కెమిస్ట్రీ చరిత్రను 25 సంవత్సరాలకు కుదించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏఐ చాలా కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?