Chennai schools gets bomb threats: చెన్నైలో పలు స్కూల్స్‌కి బాంబ్ బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. Greater Chennai Police Corporation పరిధిలోని కొన్ని స్కూల్స్‌కి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. తల్లిదండ్రులకు కాల్ చేసి తమ పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పాయి.





అయితే..పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఈమెయిల్స్ ఎవరు పంపారో గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్‌తో అన్ని స్కూల్స్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. 


"గ్రేటర్ చెన్నై పోలీస్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. కొందరు ఆగంతకులు ఈమెయిల్స్ పంపారు. వెంటనే ఆయా స్కూల్స్‌కి బాంబ్‌ స్క్వాడ్స్‌ని పంపించి తనిఖీలు నిర్వహించాం. నిందితులను గుర్తించే పనిలో ఉన్నాం. కచ్చితంగా వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం"


- పోలీస్ అధికారులు