Meta 3D Avatars: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంల్లో 3డీ అవతార్‌లు, మెటావర్స్ వైపు ప్రపంచం అడుగులు

ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రాంల్లో 3డీ అవతార్‌లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Continues below advertisement

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల పేరెంట్ కంపెనీ మెటా ఇప్పుడు కొత్తగా 3డీ అవతార్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్‌లకు ఈ 3డీ అవతార్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫీడ్ పోస్టులు, స్టోరీలు, ప్రొఫైల్ పిక్చర్లుగా వీటిని ఉంచుకోవచ్చు. దీంతోపాటు కంపెనీ తన ప్లాట్‌ఫాంలకు అప్‌డేట్స్ కూడా అందించింది.

Continues below advertisement

మరిన్ని హావభావాలు, ఫేసెస్, స్కిన్ టోన్లతో మెటా అవతార్లను కంపెనీ అప్‌డేట్ చేసింది. దీంతోపాటు కంపెనీ డిజిటల్ క్లోతింగ్‌తో కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఇందులో ఎన్ఎఫ్ఎల్ టీ షర్టులు కూడా ఉన్నాయి. సూపర్ బౌల్ కోసం వాటిని వేసుకోవచ్చు. క్వెస్ట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

అయితే ప్రస్తుతానికి ఇది అమెరికా, మెక్సికో, కెనడాల్లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ 3డీ అవతార్‌లను స్టోరీలు, డీఎంల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అవతార్‌ల్లో వేర్వేరు ఫేషియల్ షేపులు, ఎక్స్‌టెన్సివ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకమైన ఫీచర్లను ఇందులో అందించారు.

ఈ కొత్త అవతార్‌లు ప్రస్తుతం ఫేస్‌బుక్, మెసెంజర్‌ల్లో రోల్ అవుట్ అవుతున్నాయి. వినియోగదారులు అన్నిట్లో ఒకే అవతార్‌ను వాడుకోవచ్చు. లేదా ప్లాట్‌ఫాంను బట్టి వేర్వేరు అవతార్‌లను మార్చుకోవచ్చు. మెటావర్స్‌పై తమ దీర్ఘకాలిక ప్రణాళికలను తెలిపినప్పటి నుంచి, తాము సోషల్ టెక్నాలజీని తర్వాతి స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామని అవతార్స్ అండ్ ఐడెంటిటీ జనరల్ మేనేజర్ అయిగెరిమ్ షోర్మెన్ తెలిపారు.

మీకు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ.. వారి పక్కనే కూర్చున్న ఫీలింగ్‌ను ఈ మెటావర్స్ అందిస్తుందని పేర్కొన్నారు. స్నాప్ చాట్ ఏఆర్ టెక్నాలజీ ద్వారా అందించిన 3డీ అవతార్లను పోలి ఈ ఫీచర్ ఉంది. ఈ 3డీ అవతార్‌లను స్నాప్‌ల ద్వారా క్రియేట్ చేయవచ్చు.

అయితే ఈ అవతార్‌లు ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగతా ప్రాంతాలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement
Sponsored Links by Taboola