Meta poaches 28 year old Scale AI CEO after taking multibillion dollar stake in startup: ఫేస్ బుక్ యజమాని జుకర్ బెర్క్ ఇటీవ స్కేల్ ఏఐ అనే స్టార్టప్ కంపెనీలో 49 శాతం వాటాలు కొన్నారు. దీనికి కారణం .. ఆ సంస్థ 51 శాతం అమ్మడానికి నిరాకరించింది. ఎందుకంటే.. అమ్మితే యాజమాన్యం మెటా చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఆ స్కేల్ ఏఐని నడుపుతున్న వాళ్లు అంగీకరించలేదు. అలా కాకపోతే.. స్కేల్ ఏఐ సీఈవో తమ సంస్థలో చేరాలన్న ఒప్పందం మీద లక్షా ఇరవై వేల కోట్లతో షేర్లు కొంటామని ఆఫర్ ఇచ్చారు జుకర్ బెర్గ్. అక్కడ డీల్ సెట్ అయింది. ఇంతా చేసి జుకర్ బెర్గ్ ఇంత ఖర్చు పెట్టిన సీఈవో వయసు 28ఏళ్లు మాత్రమే.
డేటా-లేబలింగ్ స్టార్టప్ స్కేల్ AIలో మెటా 14.3 బిలియన్ డాలర్లతో స్కేల్ AIలో 49 శాతం వాటాను తీసుకుంది. స్కేల్ AI CEO అలెగ్జాండర్ వాంగ్ ను తమ సంస్థలో చేర్చుకోవడం కోసమే మెటా ఈ పెట్టుబడి పెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా, అలెగ్జాండర్ వాంగ్ మెటాలో చేరి సూపర్‌ఇంటెలిజెన్స్ యూనిట్‌ను నడిపించనున్నారు. మెటా కొత్త సూపర్‌ఇంటెలిజెన్స్ యూనిట్‌ను నడిపించడానికి వాంగ్‌ను ఆకర్షించడమే ఈ పెట్టుబడి ప్రధాన కారణం. వాంగ్ మెటాలో చేరి, AI మోడల్‌ల కోసం డేటా ఉత్పత్తి కార్యకలాపాలను నడిపిస్తారు.
28 ఏళ్ల అలెగ్జాండర్ వాంగ్ ఎవరంటే ?
న్యూ మెక్సికోలోని లాస్ అలమోస్‌లో చైనీస్ నుంచి వలస వచ్చిన భౌతిక శాస్త్రవేత్తల కుటుంబంలో జన్మించిన వాంగ్, MIT డ్రాప్‌అవుట్. చదువు మధ్యలోనే ఆపేసి స్కేల్ AIని తన స్నేహితులతో కలిసి స్థాపించారు. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రతిభావంతుడైన యువ వ్యవస్థాపకుడిగా పేరు తెచ్చుకున్నారు. 20 ఏళ్ల వయస్సులోనే బిలియనీర్ స్థాయికి చేరుకున్నారు. ఓపెన్AI CEO సామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ అగ్రగాములతో కలసి పని చేశాడు.
2016లో స్కేల్ AI ని స్థాపించారు. ఓపెన్AI కు చెందిన క చాట్‌జీపీటీ వంటి అధునాతన సాధనాల శిక్షణ కోసం ఖచ్చితంగా లేబుల్ చేయబడిన డేటాను స్కేల్ AI అందిస్తుంది. రిమోటాస్క్స్ , అవుట్‌లైర్ వంటి సబ్‌సిడియరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా గిగ్ వర్కర్లను నియమించి, డేటాను మాన్యువల్‌గా లేబుల్ చేస్తుంది. మే 2024లో నివిడియా, అమెజాన్, మెటా వంటి సంస్థలతో జరిగిన ఫండింగ్ రౌండ్‌లో స్కేల్ AI విలువ $14 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు. మెటాతో చేసుకున్న ఒప్పందంతో స్కేల్ AI విలువ 29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాంగ్ మెటా ఏఐ చీఫ్ గా వెళ్తూండటంతో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జాసన్ డ్రోగే తాత్కాలిక CEOగా వ్యవహరిస్తారు.
ఓపెన్-సోర్స్ AI మోడల్‌లలో ఒకప్పుడు లీడర్‌గా ఉన్న మెటా, సిబ్బంది నిష్క్రమణలు , కొత్త AI మోడల్‌ల విడుదలల వాయిదా వల్ల గూగుల్, ఓపెన్AI, డీప్‌సీక్ వంటి పోటీదారులతో పోలి్తే వెనుకబడింది. వాంగ్‌ను నియమించడం ద్వారా, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, సామ్ ఆల్ట్‌మన్ తరహా వ్యాపార నాయకత్వంతో మెటా AI ప్రయత్నాలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. స్కేల్ AI లోని 1,500 మంది ఉద్యోగులలో కొందరు వాంగ్‌తో పాటు మెటాకు వెళతారు. వాంగ్ స్కేల్ బోర్డులో కొనసాగుతారు. ఈ పెట్టుబడి మెటా రెండవ అతిపెద్ద ఒప్పందం, ఇంతకు ముందు 19 బిలియన్ డాలర్లతో వాట్సాప్‌ను కొనుగోలు చేశారు.