Ahmedabad plane crash Arjun Bai: ఎప్పుడో ఇంగ్లాండ్ కు వలస వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. కానీ ఆ దంపతులకు మాతృభూమి అంటే ప్రేమ. అందుకే తరచూ గుజరాత్ వచ్చేవారు. ఆ దంపతుల్లో భార్యకు లండన్‌లో అనారోగ్యం చేసింది. ఎంత ప్రయత్నించినా తగ్గలేదు. చివరికి చనిపోయింది. అయితే ఆమె చనిపోయే ముందు తన భర్తను ఒకే కోరిక కోరింది. తన అస్థికల్ని..తన స్వగ్రామం నుంచి ప్రవహించే నదిలో కలపాలని కోరింది. ఆమె కోరికను తీర్చేందుకు భర్త లండన్ నుంచి వచ్చాడు. కోరికను తీర్చాడు. కానీ అతను తిరిగివెళ్లలేకపోయాడు.
లండన్ లో నివసించే అర్జున్ బాయ్ అనే వ్యక్తి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన గురించి వివరాలు బంధువుల ద్వారా బయటకు వచ్చాయి. ఆ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లండన్ లో స్థిరపడిన అర్జున్ భాయ్ గుజరాతీ యువతిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్లు, నాలుగేళ్లు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ విధి వారితో ఆడుకుంది. అర్జున్ భాయ్ భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ పిల్లలకు తల్లి దూరం అయింది. తల్లి కోరికను తీర్చేందుకు వెళ్లిన తండ్రి కూడా ఇక రాడని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఏమిటో అని బంధువుల వేదన పడుతున్నారు.
ఎనిమిదేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఆ పిల్లలిద్దరూ నెల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరి వెనుక ఇలాంటి విషాద కథలు ఉన్నాయి. అవి వారి కుటుంబంలో తీర్చలేని చింతను మిగిల్చాయి.
డాక్టర్ ప్రతీక్ జోషి ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలతో సహా అందరూ చనిపోయారు. ఈ ఘటన కూడా గుండెల్ని పిండేస్తోంది.